నేటి నుంచి తమిళనాట 144 సెక్షన్‌

ABN , First Publish Date - 2020-03-24T09:19:41+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 144వ సెక్షన్‌ విధించింది. మంగళవారం సాయంత్రం ఆరుగంటల నుండి ఈ నెల 31 వరకు ఈ సెక్షన్‌ అమలులో...

నేటి నుంచి తమిళనాట 144 సెక్షన్‌

చెన్నై, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 144వ సెక్షన్‌ విధించింది. మంగళవారం సాయంత్రం ఆరుగంటల నుండి ఈ నెల 31 వరకు ఈ సెక్షన్‌ అమలులో ఉంటుందని ప్రకటించింది. అదే సమయంలో అన్ని జిల్లాల సరిహద్దులను మూసివేసింది. ఈ మేరకు సోమవారం శాసనసభలో సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. కరోనా నిరోధానికి ప్రజలంతా స్వీయ గృహ నిర్బంధం పాటించాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెన్నై, కాంచీపురం, ఈరోడ్‌ జిల్లాలను మాత్రమే లాక్‌డౌన్‌ చేయాలని సూచించినా, కరోనా కట్టడి కోసం అన్ని జిల్లాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు చెప్పారు. పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

Read more