ఎస్సీ వర్గీకరణకు 14 రాష్ట్రాలు వ్యతిరేకం

ABN , First Publish Date - 2020-09-21T07:43:48+05:30 IST

ఎస్సీ వర్గీకరణను 14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కఠారియా తెలిపారు. 7 రాష్ట్రాలే వర్గీకరణకు మద్దతిచ్చాయని ఆదివారం లోక్‌సభలో ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్‌ ఒవైసీ, సయ్యద్‌ ఇంతియాజ్‌ జలీల్‌, కాంగ్రెస్‌ ఎంపీ ఆడూర్‌ ప్రకాశ్‌ల ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు...

ఎస్సీ వర్గీకరణకు 14 రాష్ట్రాలు వ్యతిరేకం

  • 7 రాష్ట్రాలు మాత్రమే మద్దతు తెలిపాయి
  • వాటిలో ఏపీ, తెలంగాణ: మంత్రి కఠారియా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణను 14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కఠారియా తెలిపారు. 7 రాష్ట్రాలే వర్గీకరణకు మద్దతిచ్చాయని ఆదివారం లోక్‌సభలో ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్‌ ఒవైసీ, సయ్యద్‌ ఇంతియాజ్‌ జలీల్‌, కాంగ్రెస్‌ ఎంపీ ఆడూర్‌ ప్రకాశ్‌ల ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, హరియాణ, జార్ఖండ్‌, కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలు వర్గీకరణకు మద్దతిచ్చాయన్నారు. అసోం, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ, ఒడిశా, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాలు వర్గీకరణను వ్యతిరేకించాయని వివరించారు. వర్గీకరణకు బదులుగా ఎస్సీల్లో అత్యంత పేదరికం ఉన్నవారికి సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా సాధికారత కల్పించడానికి ప్రత్యేక పథకాలు అమలు చేయాలని ఈ రాష్ట్రాలు ప్రతిపాదించాయన్నారు. ఉమ్మడి ఏపీలో వర్గీకరణపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ నివేదిక ఆధారంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరామన్నారు.


Updated Date - 2020-09-21T07:43:48+05:30 IST