షెల్టర్ హోమ్‌లో మరో 14 గోవులు మృతి

ABN , First Publish Date - 2020-11-23T00:42:04+05:30 IST

రాజస్థాన్‌లోని చురులో ఉన్న షెల్టర్ హోమ్‌లో కలుషిత ఆహారంతో (ఫుడ్ పాయిజనింగ్) మరో..

షెల్టర్ హోమ్‌లో మరో 14 గోవులు మృతి

చురు: రాజస్థాన్‌లోని చురులో ఉన్న షెల్టర్ హోమ్‌లో కలుషిత ఆహారంతో (ఫుడ్ పాయిజనింగ్) మరో 14 ఆవులు చనిపోయాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి రెండ్రోజుల్లో మృతి చెందిన ఆవులు సంఖ్య 94కు చేరుకుంది. చురులోని బిల్యూబస్ గ్రామంలో గోసంరక్షణశాల ఉంది. ఒక్క శనివారంనాడే సుమారు 80 ఆవులు మృతి చెందారు. కాగా, కలుషితాహారం కారణంగానే గోవులు మరణించాయా, ఏదైనా వ్యాధి సోకిందా అనే దానిపై విచారణ జరుగుతోందని సర్దార్‌షహర్ తహసిల్తర్ కుటేంద్ర కన్వర్ చెప్పారు. గోవులకిచ్చిన ఆహారం శాంపుల్స్‌ను ల్యాబ్ పరీక్షల కోసం పంపామని తెలిపారు.

Updated Date - 2020-11-23T00:42:04+05:30 IST