13 ఏళ్ల బాలికపై యూపీలో సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2020-08-16T17:55:55+05:30 IST

లక్ష్మీపూర్ జిల్లాలోని ఖేరీ గ్రామంలో ఘోరం జరిగింది. 13 ఏళ్ల చిన్నారిపై దుండగులు సామూహిక

13 ఏళ్ల బాలికపై యూపీలో సామూహిక అత్యాచారం

లక్నో : లక్ష్మీపూర్ జిల్లాలోని ఖేరీ గ్రామంలో ఘోరం జరిగింది. 13 ఏళ్ల చిన్నారిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక మృతి చెందింది. ఆ మృత దేహాన్ని చెరుకు తోటలో పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె గొంతును కోసేశారని, నాలుకను కూడా కత్తిరించారని బాలిక తండ్రి వాపోయాడు. ఆ బాలిక మృతదేహం నిందితుల పొలంలోనే లభ్యం కావడం గమనార్హం. అయితే పోలీసులు మాత్రం విభిన్నంగా చెబుతున్నారు.


ఆమె నాలుక కోసినట్లు, కళ్లు పీకినట్లు తమ పోస్ట్‌మార్టం రిపోర్టులో నిర్ధారణ కాలేదని, అత్యాచారం, గొంతు కోసినట్లు మాత్రమే వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ బాలిక శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనబడకుండా పోయింది. ఆమె కోసం అన్ని చోట్లా వెతికామని ఆమె తండ్రి తెలిపారు. చివరికి ఆమెను ఓ పంట పొలంలో కనుగొన్నామని పేర్కొన్నారు. అయితే దీనిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన అని, సమాజ్‌వాదీకి, బీజేపీ పాలనకు ఏమీ తేడాలేదని మాయావతి విమర్శించారు. 

Updated Date - 2020-08-16T17:55:55+05:30 IST