న‌లుగురు ఐపీఎస్‌ల‌తో పాటు 1360 మంది పోలీసుల‌కు క‌రోనా

ABN , First Publish Date - 2020-07-19T12:19:47+05:30 IST

పోలీసు బలగాలలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పటివరకు నలుగురు ఐపీఎస్‌లతో సహా 1360 మందికిపైగా...

న‌లుగురు ఐపీఎస్‌ల‌తో పాటు 1360 మంది పోలీసుల‌కు క‌రోనా

ల‌క్నో: పోలీసు బలగాలలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పటివరకు నలుగురు ఐపీఎస్‌లతో సహా 1360 మందికిపైగా పోలీసులు క‌రోనా బారిన ప‌డ్డారు. పోలీసు ప్రధాన కార్యాలయం తెలిపిన వివ‌రాల ప్రకారం ప్రస్తుతం పోలీసు బ‌ల‌గాల్లో 500 కోవిడ్ -19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌తో సహా 10 మంది పోలీసులు క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. ఈ నేప‌ధ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు విధించిన ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని డీజీపీ ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. ఇదిలావుండ‌గా లాక్‌డౌన్ అమలు చేసిన తర్వాత పోలీసులు ఇప్పటివరకు 25.81 లక్షల వాహనాలకు చలానా విధించారు. ఇందులో 63,603 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలంలో చ‌లానాల ద్వారా ద్వారా రూ. 47.60 కోట్లు వ‌సూలుచేశారు. వీటితో పాటు సెక్షన్ 188 కింద 11,4189, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (ఇసీ యాక్ట్) కింద 753 కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-19T12:19:47+05:30 IST