వామ్మో.. ఒకే ఐఎంఈఐతో 13,500 మొబైల్స్‌

ABN , First Publish Date - 2020-06-06T07:56:54+05:30 IST

వామ్మో.. ఒకే ఐఎంఈఐతో 13,500 మొబైల్స్‌

వామ్మో.. ఒకే ఐఎంఈఐతో 13,500 మొబైల్స్‌

మీరట్‌, జూన్‌ 5: ఒక సిమ్‌ కలిగిన మొబైల్‌కు ఒక ఇంటర్నేషనల్‌ మొబై ల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబరు మాత్రమే ఉంటుంది. రెం డు సిమ్‌లు ఉంటే రెండు నెంబర్లు ఉంటాయి.  ఒకే నెంబరు ఏ రెండు ఫోన్ల కూ ఉండడానికి వీల్లేదు. కానీ, ఏకంగా 13,500 ఫోన్లు ఒకే ఐఎంఈఐ నెంబరుతో ఉండడాన్ని గుర్తించిన మీరట్‌ పోలీసులు ఆశ్చర్యపోయారు. ఒక పోలీ స్‌ కొత్త మొబైల్‌ కొన్నారు. రిపేరు చేయించినా సరిగా పని చేయకపోవడంతో పరిశీలించాలంటూ సైబర్‌ క్రైం పోలీసులకు ఇచ్చారు. దాంతో విస్తుగొలిపే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్స్‌ తయారీ కంపెనీ, సర్వీస్‌ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.    

Updated Date - 2020-06-06T07:56:54+05:30 IST