కర్ణాటకలో కొత్తగా 130 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-24T23:30:18+05:30 IST
కర్ణాటకలో కొత్తగా 130 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం...

బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 130 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 130 కోవిడ్-19 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,089కి చేరింది. వీరిలో 654 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1391 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది మృత్యువాత పడ్డారు.