మోన్దార్- పూంచ్ సెక్టార్‌లో కాల్పులు... 13 మంది ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2020-06-02T00:59:53+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లోని మోన్దార్ - పూంచ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం భీకర

మోన్దార్- పూంచ్ సెక్టార్‌లో కాల్పులు... 13 మంది ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని మోన్దార్ - పూంచ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మొదట జవాన్లకు, ఉగ్రవాదులకు సోమవారం ఉదయం రాజౌరి జిల్లాలో ఎదురు కాల్పు జరిగాయి. ఆ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.


తర్వాత జమ్మూలోని మెంధర్ ప్రాంతంలో జవాన్లు గాలిస్తున్న సందర్భంగా జరిగిన  కాల్పుల్లో మరో పది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 13కు చేరింది. కౌంటర్ చొరబాటు ఆపరేషన్లను మే 28 నుంచి ప్రారంభించామని, అప్పటి నుంచి తాము నిరంతర అప్రమత్తతతోనే ఉన్నామన్నారు.


మెన్దార్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద పది మంది ఉగ్రవాదులను హతం చేశామని, పూంఛ్ సెక్టార్లో గాలింపు చర్యలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పీవోకే నుంచి సోమవారం ఉదయం నౌషెరా సెక్టారు మీదుగా నియంత్రణ రేఖ దాటి చొరబడుతుండగా తాము కాల్పులు జరిపామని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-06-02T00:59:53+05:30 IST