1273 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-18T20:21:15+05:30 IST

మహారాష్ట్రలో కోవిడ్-19 వ్యాప్తితో పోలీసు సిబ్బంది సైతం విలవిల్లాడుతున్నారు. గత 24 గంటల్లో 67 మంది పోలీసు సిబ్బంది కరోనా వైరస్ బారిన..

1273 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

ముంబై: మహారాష్ట్రలో కోవిడ్-19 వ్యాప్తితో పోలీసు సిబ్బంది సైతం విలవిల్లాడుతున్నారు. గత 24 గంటల్లో 67 మంది పోలీసు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వైద్య పరీక్షలో వీరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన పోలీసు సిబ్బంది సంఖ్య 1,273కు చేరింది. మొత్తం కేసుల్లో 131 మంది పోలీసు అధికారులుఉండగా, 1,142 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇంతవరకూ 11 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. 291 మంది పోలీసులకు పూర్తి స్వస్థత చేకూరించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా వివరాలప్రకారం, మహారాష్ట్రలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 33,053కు చేరింది.

Updated Date - 2020-05-18T20:21:15+05:30 IST