బెంగళూరులో 120 అడుగుల ఎత్తైన వివేకానంద విగ్రహం

ABN , First Publish Date - 2020-06-01T23:24:24+05:30 IST

ఇప్పటి వరకూ రైతులకు, కార్మికులకు ఒక్క రూపాయి కూడా చేరలేదని, ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటి వరకూ బ్యాంకర్ల

బెంగళూరులో 120 అడుగుల ఎత్తైన వివేకానంద విగ్రహం

బెంగళూరు : 120 అడుగుల ఎత్తు వివేకానందుడి విగ్రహాన్ని నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి యడియూరప్ప నిర్ణయం ప్రస్తుతం కర్నాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. బన్నేర్‌గట్టా జాతీయ పార్కుకు పది కిలోమీటర్ల దూరంలోని ముత్యాల మధువు జలపాతం వద్ద ఈ విగ్రహాన్ని నెలకొల్పాలని యడ్డి సర్కార్ డిసైడైంది.  ఇంతటి భారీ విగ్రహాన్ని నెలకొల్పాలన్న యడియూరప్ప నిర్ణయంపై పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అభ్యంతరం వెలిబుచ్చారు.


లాక్‌డౌన్, కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి నిర్ణయాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై మంత్రి సోమన్న స్పందించారు. గుజరాత్‌లో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహ స్ఫూర్తితోనే 120 అడుగుల వివేకానంద విగ్రహాన్ని నెలకొల్పాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


‘‘వంద ఎకరాల సువిశాల స్థలంలో విగ్రహాన్ని నెలకొల్పాలని తాము డిసైడ్ అయ్యాము. దీనిని టూరిజం హబ్‌గా మారుస్తాం’’ అని గృహ నిర్మాణ మంత్రి సోమన్న తెలిపారు. అయితే దీనిపై టూరిజం మంత్రి సీటీ రవిని అడగ్గా... ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించారు. ’’ఈ ప్రాజెక్టుపై నాకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ స్థాయిలో దీనిపై సరైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు. గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం ప్రారంభమవుతుందన్న అవగాహన నాకు లేదు’’ అని సీటీ రవి తెలిపారు. 


యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి సరైన ప్రాధమ్యాలు లేవని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మండిపడ్డారు. 120 యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి సరైన ప్రాధమ్యాలు లేవని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మండిపడ్డారు. 120 అడుగుల ఎత్తున్న వివేకానంద స్వామి విగ్రహం నెలకొల్పడానికి ఇది సరైన సమయం కాదని, వలస కార్మికుల వెతలను తీర్చాల్సిన సమయమని అన్నారు.


ఇప్పటి వరకూ రైతులకు, కార్మికులకు ఒక్క రూపాయి కూడా చేరలేదని, ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటి వరకూ బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించలేదని తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద పుష్కలంగా నిధులున్నప్పుడు నిర్మించాలి కానీ, ఇంతటి క్లిష్ట సమయంలో కాదని, దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ఇప్పటి వరకూ ఈ విగ్రహానికి ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ... విగ్రహానికి చెందిన ప్రాథమిక పనులు మాత్రం ప్రారంభమయ్యాయి. 

Updated Date - 2020-06-01T23:24:24+05:30 IST