మహారాష్ట్రలో 200 దాటిన కోవిడ్-19 కేసులు

ABN , First Publish Date - 2020-03-30T17:17:13+05:30 IST

ఈరోజు మరో 12 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 215 కు చేరుకుంది. కొత్తగా చేరిన 12 మంది రోగులలో ఐదుగురు పూణే, ముగ్గురు...

మహారాష్ట్రలో 200 దాటిన కోవిడ్-19 కేసులు

ముంబై: ఈరోజు మరో 12 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 215 కు చేరుకుంది. కొత్తగా చేరిన 12 మంది రోగులలో ఐదుగురు పూణే, ముగ్గురు ముంబై, నాగ్‌పూర్ నుంచి ఇద్దరు, కొల్లాపూర్, నాసిక్ నుండి ఒక్కొక్కరు ఉన్నారని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా ఎనిమిది మంది మరణించారు. మరోవైపు, మార్చి 23 న ఓ వ్యక్తి అమెరికా నుంచి వాసాయి ప్రాంతానికి వచ్చాడని, దర్యాప్తు తర్వాత క్వారంటైన్లో ఉండాలని అతనికి పోలీసులు తెలిపారు. దీని గురించిపోలీసు ప్రతినిధి హేమంత్ కట్కర్ మాట్లాడుతూ మార్చి 28 న అతను ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు తెలిసిందని, ఆయనపై  కేసు నమోదైందన్నారు. అయితే, అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  జిల్లాలో నిషేధం అమల్లో ఉందని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-03-30T17:17:13+05:30 IST