మరో 116 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-29T20:00:00+05:30 IST

కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్న పోలీసుల సంఖ్య గత 24 గంటల్లో మహారాష్ట్రలో అనూహ్యంగా పెరిగింది. తాజాగా మరో..

మరో 116 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

ముంబై: కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్న పోలీసుల సంఖ్య గత 24 గంటల్లో మహారాష్ట్రలో అనూహ్యంగా పెరిగింది. తాజాగా మరో 116 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ముగ్గురు పోలీసులు మృత్యువాత పడినట్టు రాష్ట్ర పోలీసు శాఖ శుక్రవారంనాడు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ బారిన పడిన మొత్తం పోలీసుల సంఖ్య 2,211కు చేరుకోగా, ఇంతవరకూ 25 మంది మృతి చెందారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, రాష్ట్రంలో ఇంతవరకూ 59,546 మంది కరోనా పాజిటివ్ బారిన పడగా, వీరిలో 18,616 మందికి స్వస్థత చేకూరింది. మృతుల సంఖ్య 1,982కు చేరింది.

Updated Date - 2020-05-29T20:00:00+05:30 IST