ఆర్మీలో 110 మందికి కరోనా..!

ABN , First Publish Date - 2020-07-19T18:21:11+05:30 IST

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 110 మంది ఆర్మీ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు.

ఆర్మీలో 110 మందికి కరోనా..!

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 110 మంది ఆర్మీ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. గత రెండు మూడు రోజుల్లోనే 100 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలిందన్నారు. అయితే వీరికి కరోనా ఎలా సోకిందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్మీ సిబ్బంది అయిన వారు ఏయే ప్రాంతాలకు వెళ్లారనే అధికారిక రికార్డుల్లో నమోదై ఉంటుందన్నారు. ఈ విషయంలో అన్ని చర్యలూ చేపడుతున్నామని సీఎం హామీ ఇచ్చారు. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకూ 4102 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 1030 మంది రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా..మూడు వేల పైచిలుకు రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయిపోయారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 కరోనా మరణాలు సంభవించినట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. 


Updated Date - 2020-07-19T18:21:11+05:30 IST