సీఎం దేవ్‌ మా మాట వినడం లేదు

ABN , First Publish Date - 2020-10-12T08:19:10+05:30 IST

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ తమ మాట వినడం లేదని 11 మంది ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఆయనపై బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి వారు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు...

సీఎం దేవ్‌ మా మాట వినడం లేదు

  • త్రిపురలో 11 మంది ఎమ్మెల్యేల ఆరోపణ 


అగర్తల, అక్టోబరు 11: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ తమ మాట వినడం లేదని 11 మంది ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఆయనపై బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి వారు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, 2018లో పార్టీ గెలుపు కోసం శ్రమించిన వారిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే తమకు పార్టీతో సమస్య లేదని, ప్రధాని మోదీ పట్ల, ఆయన నాయకత్వం పట్ల ఇప్పటికీ విశ్వాసంగానే ఉన్నామని చెప్పారు.  

Updated Date - 2020-10-12T08:19:10+05:30 IST