రాజ్యసభ 11 స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు

ABN , First Publish Date - 2020-10-13T19:47:05+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో ఎన్నికలు జరుగుతుండడంతో.. కోవిడ్-19 ఆరోగ్య నియమాలను తప్పనిసరి చేసినట్లు ఈసీ పేర్కొంది

రాజ్యసభ 11 స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు

న్యూఢిల్లీ: నవంబర్ 9న రాజ్యసభలోని 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఖాళీల్లో ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి ఈ ఎన్నికలు జరగనున్నాయని భారత ఎన్నికల కమిషన్ మంగళవారం తెలిపింది. ఈ నెల 27కి నామినేషన్లకు తుది గడువు అని, నవంబర్ 2లోపు నామినేషన్ ఉపసంహరణ సమయం ఉందని ఈసీఐ పేర్కొంది.


కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో ఎన్నికలు జరుగుతుండడంతో.. కోవిడ్-19 ఆరోగ్య నియమాలను తప్పనిసరి చేసినట్లు ఈసీ పేర్కొంది. మాస్కులు, థర్మస్ స్క్రీనింగ్ తప్పనిసరి అని, సానిటైజర్ ఉపయోగించాలని, భౌతిక దూరం నియమాలను అతిక్రమించరాదని ఈసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2020-10-13T19:47:05+05:30 IST