సంతకం చేయాలంటూ.. సీఏఏ నిరసనకారులకు 50లక్షల బాండ్

ABN , First Publish Date - 2020-02-12T20:20:55+05:30 IST

సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది.

సంతకం చేయాలంటూ.. సీఏఏ నిరసనకారులకు 50లక్షల బాండ్

సంభాల్: సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలామందికి ఈ విషయంలో నోటీసులు కూడా పంపింది. ఈ క్రమంలోనే సీఏఏ, ఎన్నార్సీ నిరసనల్లో పాల్గొన్న 11మందికి తాజాగా నోటీసులు జారీచేసింది. సదరు నిరసనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. వీళ్లు ఒక్కొక్కరూ రూ.50లక్షల బాండ్‌పై సంతకాలు చేయాలని అధికారులు సూచించారు. ఈ 11మందేగాక, మరో 24మందికి కూడా త్వరలోనే ఈ నోటీసులు పంపుతామని వారు వెల్లడించారు. అయితే తమకు ఇలా నోటీసులు పంపడంపై సదరు నిరసనకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2020-02-12T20:20:55+05:30 IST