ఓటేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చిన 100 ఏళ్ల వృద్ధుడు

ABN , First Publish Date - 2020-11-07T22:42:24+05:30 IST

ఓటేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చిన 100 ఏళ్ల వృద్ధుడు

ఓటేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చిన 100 ఏళ్ల వృద్ధుడు

పాట్నా: బీహార్ రాష్ట్రంలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు క్యూ కట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రెండు దశల పోలింగ్‌తో పోలిస్తే మూడో దశలో ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోందని ఈసీ పేర్కొంది.


ఈ నేపథ్యంలో బీహార్‌లోని కతిహార్ జిల్లాలో సుఖ్‌దేవ్ మండల్ అనే 100 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వృద్ధుడితో ఓటు వేయించేందుకు అతనిని మంచం మీద పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడవ దశలో 78 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది.


ఎయిర్ వీడియో సౌజన్యంతో..

Updated Date - 2020-11-07T22:42:24+05:30 IST