10,00,00,000 భారత్‌కు రష్యా డోసులు

ABN , First Publish Date - 2020-09-17T07:38:59+05:30 IST

ప్రపంచంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ 10 కోట్ల డోసులు భారత్‌కూ అందనున్నాయి...

10,00,00,000 భారత్‌కు రష్యా డోసులు

  • వ్యాక్సిన్‌ పంపిణీ, ప్రయోగ పరీక్షలకు
  • హైదరాబాద్‌ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం
  • డిసెంబరుకల్లా పంపిణీ ప్రారంభమయ్యే చాన్స్‌
  • అమెరికా పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌?


న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 : ప్రపంచంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ 10 కోట్ల డోసులు భారత్‌కూ అందనున్నాయి. సకాలంలో ప్రయోగ పరీక్షలు పూర్తయి, భారత ఔషధ నియంత్రణ సంస్థల నుంచి వేగంగా అనుమతులు మంజూరైతే డిసెంబరు నుంచే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సతో ఒప్పందం కుదుర్చుకున్నామని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) సీఈవో కిరిల్‌ దిమిత్రీవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈవివరాలను డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ కూడా ధ్రువీకరించారు. ‘స్పుత్నిక్‌-వి’ మూడోదశ ప్రయోగ పరీక్షలు, పంపిణీ విషయంలో ఆర్‌డీఐఎ్‌ఫతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రయల్స్‌కు అనుమతుల అంశం ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉందని తెలిపారు.


భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల సహకారంతో 30 కోట్ల డోసుల ఉత్పత్తికి రష్యా ఒప్పందాలు కుదుర్చుకోగా, వాటిలో 10 కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌ ద్వారా దేశంలో పంపిణీ చేయించనుంది. కాగా, తమ దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలు అందించేవారు, తీవ్ర ఇన్ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉన్న వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయాలని భావిస్తోంది. రెండు, మూడో విడతల్లో అమెరికావ్యాప్తంగా అవసరమైన వారందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రచార కార్యక్రమాలను జనవరి నుంచే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-17T07:38:59+05:30 IST