గుజరాత్ నుంచి ఢిల్లీకి 10 వేల మంది రైతులు

ABN , First Publish Date - 2020-12-18T05:18:58+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా గుజరాత్‌లోని 17 రైతు సంఘాలు ముందుకొచ్చాయి....

గుజరాత్ నుంచి ఢిల్లీకి 10 వేల మంది రైతులు

గాంధీనగర్: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా గుజరాత్‌లోని 17 రైతు సంఘాలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా గుజరాత్ కిసాన్ సంఘర్ష్ సమితి పేరుతో దాదాపు 10 వేల మంది రైతులు మరో రెండు వారాల్లోగా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే గుజరాత్ నుంచి వందలాది మంది రైతులు జైపూర్-ఢిల్లీ సరిహద్దు సహా ఇతర ఢిల్లీ సరిహద్దులకు తరలివెళ్లారు. వచ్చే 15 రోజుల్లో దశల వారీగా రైతు సంఘాలు ఒక్కో తహశీల్ నుంచి 10-30 మంది రైతులను సమీకరించి ఢిల్లీకి పంపనున్నట్టు సమాచారం.  ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతటి భారీ స్థాయిలో ఉద్యమం జరగడం బహుశా ఇదే తొలిసారి. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చీకటి చట్టాల వల్ల కేవలం రైతులను మాత్రమే కాదు.. సమాన్య ప్రజలు, చిరు వ్యాపారులు, పేద ప్రజలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి...’’ అని గుజరాత్ కాంగ్రెస్ రైతు విభాగం చైర్మన్ పాల్ అంబాలియా పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-18T05:18:58+05:30 IST