4 రోజుల్లో 1000 మరణాలు

ABN , First Publish Date - 2020-06-06T07:17:40+05:30 IST

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కొవిడ్‌-19 మృత్యుఘంటికలు మోగిస్తోంది. మనదేశంలో తొలి కరోనా మరణం మార్చి 12న నమోదు కాగా..

4 రోజుల్లో 1000 మరణాలు

  • గురువారానికి 3 లక్షలకు పైగా కేసులు

న్యూఢిల్లీ, జూన్‌ 5: దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కొవిడ్‌-19 మృత్యుఘంటికలు మోగిస్తోంది. మనదేశంలో తొలి కరోనా మరణం మార్చి 12న నమోదు కాగా.. ఏప్రిల్‌ 29 నాటికి 1000 మరణాలు నమోదయ్యాయి. తొలి వెయ్యి మరణాలకు 48 రోజులు పట్టింది. మే 31 నుంచి జూన్‌ 4 మధ్య, అంటే కేవలం నాలుగు రోజుల్లో 1000 మరణాలు నమోదయ్యాయి! ఇక కేసుల సంఖ్యలో ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్న భారత్‌ జూన్‌ 15 నాటికి నాలుగోస్థానానికి చేరుకునే అవకాశముందని ఎపిడమాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.


రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య విషయంలో భారతదేశం ఇప్పుడు నాలుగోస్థానంలో ఉందన్నారు. జూన్‌ 4, 5 తేదీల్లోనే దేశంలో దాదాపు 19 వేల కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. ఇదే వేగంతో కొత్త కేసులు నమోదైతే ఈ వారాంతానికే ఇటలీ, స్పెయిన్‌ దేశాలను దాటేస్తుందని.. జూన్‌ రెండోవారం ముగిసే సమయానికి బ్రిటన్‌ను కూడా దాటేసి 4వ చేరుతుందని చెప్పారు. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 2,26,770. కేసుల సంఖ్య వచ్చే గురువారానికి 3 లక్షల మార్కు దాటే ప్రమాదముందని తెలిపారు. 



Updated Date - 2020-06-06T07:17:40+05:30 IST