వలస కూలీల కోసం 1000 బస్సులు

ABN , First Publish Date - 2020-05-17T07:33:40+05:30 IST

వలస కూలీలను స్వస్థలాలకు సురక్షితంగా చేర్చేందుకు తామే వెయ్యి బస్సులు నడుపుతామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వెల్లడించారు.

వలస కూలీల కోసం 1000 బస్సులు

  • అనుమతించండి.. ప్రియాంక వినతి

న్యూఢిల్లీ, మే 16: వలస కూలీలను స్వస్థలాలకు సురక్షితంగా చేర్చేందుకు తామే వెయ్యి బస్సులు నడుపుతామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వెల్లడించారు. దీని ఖర్చును పార్టీ భరిస్తుందని, బస్సులు నడిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఘాజీపూర్‌,  నోయిడా సరిహద్దుల నుంచి 500 బస్సుల చొప్పున నడుపుతామని తెలిపారు. యూపీలో 65 మంది కూలీలు ప్రమాదాల్లో చనిపోయారని, కరోనా మృతుల కన్నా ఇది ఎక్కువన్నారు. 

Updated Date - 2020-05-17T07:33:40+05:30 IST