లాక్డౌన్ పట్టించుకోకుండా.. దర్గాలో చేరిన 100 మంది!
ABN , First Publish Date - 2020-04-01T21:37:25+05:30 IST
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఇలాంటి సమయంలో ప్రజలు రోడ్లపైకి రావద్దని ప్రభుత్వం కోరింది.

జైపూర్: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఇలాంటి సమయంలో ప్రజలు రోడ్లపైకి రావద్దని ప్రభుత్వం కోరింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఇటీవలే కొంతమంది ముస్లింలు ఓ మత సంబంధ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన పలు రాష్ట్రాల్లోని వారు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ ఘటన గురించి మర్చిపోక ముందే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. సర్వార్ టౌన్లో ఉన్న ఓ దర్గాలో మంగళవారం జరిగిన మత సంబంధ వేడుకకు 100 మందికిపైగా హాజరైనట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, వారందర్నీ చెల్లాచెదురు చేశారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి మరీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకుగానూ ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.