కర్నాటకలో మరో పది మందికి కరోనా పాజిటివ్.. 74కు చేరిన కేసులు

ABN , First Publish Date - 2020-03-28T22:30:57+05:30 IST

కర్నాటక రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య...

కర్నాటకలో మరో పది మందికి కరోనా పాజిటివ్.. 74కు చేరిన కేసులు

బెంగళూరు : కర్నాటక రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మహిళ భర్త ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగి వచ్చి కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా బాధితుల సంఖ్య 74కు చేరిందని కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2020-03-28T22:30:57+05:30 IST