10 అంకెల మొబైల్ నెంబర్లే : ట్రాయ్
ABN , First Publish Date - 2020-06-01T06:28:35+05:30 IST
పది అంకెల మొబైల్ నెంబర్ల స్థానంలో 11 అంకెల మొబైల్ నెంబర్లను అందుబాటులోకి తీసుకురావాలని తాము సూచించలేదని టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదివారం స్పష్టం...
న్యూఢిల్లీ, మే 31: పది అంకెల మొబైల్ నెంబర్ల స్థానంలో 11 అంకెల మొబైల్ నెంబర్లను అందుబాటులోకి తీసుకురావాలని తాము సూచించలేదని టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదివారం స్పష్టం చేసింది. ల్యాండ్‌లైన్ల నుంచి మొబైల్ నెంబర్లకు ఫోన్ చేస్తున్నప్పుడు ముందు సున్నాను జతచేయాలని మాత్రమే సూచించినట్టు వెల్లడించింది. దేశంలో మొబైల్ సర్వీసులకు సంబంధించి 10 అంకెల నెంబర్ విధానమే కొనసాగుతుందని తెలిపింది.