మోకాళ్ల నొప్పులకు ఆపరేషన్ లేని వైద్యం
ABN , First Publish Date - 2020-12-01T17:49:14+05:30 IST
వయసు మళ్లిన వారిలో సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. ఈ సమస్య వారిలో జీవితం పట్ల నిరాశకు దారితీస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఉపశమనం పొందేందుకు నూతన వైద్య విధానం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స అందుబాటులో ఉంది. ఈ చికిత్సలో రోగి రక్తంలోని ప్లాస్మాను సంగ్రహించి ఈ సమస్యతో బాధ పడుతున్నవారి

ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా(PRP) చికిత్స
వయసు మళ్లిన వారిలో సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. ఈ సమస్య వారిలో జీవితం పట్ల నిరాశకు దారితీస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఉపశమనం పొందేందుకు నూతన వైద్య విధానం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స అందుబాటులో ఉంది. ఈ చికిత్సలో రోగి రక్తంలోని ప్లాస్మాను సంగ్రహించి ఈ సమస్యతో బాధ పడుతున్నవారి మోకాలులో ప్రవేశపెడతారు. ఈ విధంగా చేయడం వల్ల వారు సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొంది, వారి జీవితంలో సరికొత్త ఆశ చిగురిస్తుంది.
మోకాళ్ల నొప్పులు సమస్య వృద్ధులలో, యువకులలో, క్రీడాకారులలో గాయాల వల్ల, స్థూలకాయుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య కీళ్ల ప్రాంతంలోని గాయాలు, స్నాయువు గాయాలు లేదా బుర్సిటిస్ వంటి వాటి వల్ల ప్రభావితం అవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ మృదులాస్థి అరిగిపోవడం వల్ల సంభవిస్తుంది. వృద్ధాప్యంలో మృదులాస్థి అరుగుదల వల్ల అధిక బరువు మోకాలి భాగలో నిర్థిష్టమయి ఈ సమస్య ఎక్కువవుతుంది.
ఈ సమస్య ఉన్నవారికి ప్రారంభదశలో మెట్లు ఎక్కేటప్పుడు, నడిచినప్పడు మోకాలు నొప్పి కలుగుతుంది. క్రమేపి కీళ్ల వాపు, మోకాలు ఎర్రబడడం, బలహీనంగా తయారవడం, ఆ తరువాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియ 2-5 సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది. మోకాలు నొప్పి ప్రారంభంలో రోగులు ఫిజియోథెరపిస్ట్ సలహా మేరకు కొన్ని రకాల శారీరక వ్యాయామాలు చేస్తారు. మరికొందరు పెయిన్కిల్లర్లు వాడతారు. ఇలా చేయడం వల్ల తరువాతి దశలలో వారు పెయిన్ కిల్లర్లకు బానిస అవుతారు. ఈ మందులు ప్రారంభంలో కలిగే రోగలక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటితో మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉంది. దీంతో పూర్తిగా మోకాలు మార్పిడి చేయాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది.
ఈ సమస్యకు సమర్థమైన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్పీ) చికిత్స అందుబాటులోకి వచ్చేంత వరకూ మిగతా చికిత్సలు ప్రభావం చూపించలేకపోయాయి. పీఆర్పీ చికిత్స ద్వారా ఆపరేషన్ లేకుడానే శాశ్వత పరిష్కారం దొరకుతుంది. రోగుల రక్తాన్ని తీసుకొని (20మి.లీ), ప్రత్యేక పరికరంతో వృద్ధి కారకాన్ని సేకరిస్తారు. ప్లేట్లెట్స్లో చాలా వృద్ధి కారకాలు ఉన్నాయి. వీటిని దెబ్బతిన్న కణజాలంలోకి ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెడతారు. దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్ చేయడానికి ఈ వృద్ధి కారకం సహాయపడుతుంది. ఈ చర్య కణజాలం పునరుత్పత్తి అయి, క్షీణించిన మృదులాస్థితో చేరి దానిని ఆరోగ్యకరమైన కణజాలంతో మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది. ఈ విధానంలో మృదులాస్థి పునరుత్పత్తికి దాదాపు మూడు నెలలు పడుతుంది.
డాక్టర్ . సుధీర్ దారా
ఫౌండర్ - డైరెక్టర్ ఆఫ్ ఇపియాన్
4వ అంతస్తు, అపురూప పిసిహెచ్
రోడ్ నం.2, బంజారాహిల్స్ హైదరాబాద్
కాల్:8466044441, 040 48554444