నీళ్లు తాగడానికీ ఉందో వేళ!
ABN , First Publish Date - 2020-11-28T17:05:29+05:30 IST
శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో తెలుసు కదా! అయితే నీళ్లు తాగడానికి కూడా వేళలున్నాయి.

ఆంధ్రజ్యోతి(28-11-2020)
శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో తెలుసు కదా! అయితే నీళ్లు తాగడానికి కూడా వేళలున్నాయి.
అవేమిటంటే...
వేకువనే: ఉదయాన్నే నిద్ర లేవగానే గ్లాసు నీళ్లు తాగాలి. దీంతో శరీర భాగాలు తిరిగి ఉత్తేజితమవుతాయి. అలాగే శరీరం కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది.
వర్కవుట్ తరువాత: వ్యాయామాలు చేసిన తరువాత నీళ్లు తాగితే అలసట తగ్గి, శరీరం శక్తిని పొందుతుంది. అంతేకాదు గుండె కొట్టుకొనే వేగం సాధారణ స్థితికి చేరుతుంది.
అరగంట ముందు: భోజనం చేయడానికి అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగితే పొట్ట నిండుగా అనిపించి తక్కువగా తింటారు. ఇలాచేస్తే తొందరగా బరువు తగ్గుతారు.
స్నానానికి ముందు: స్నానం చేసేటప్పుడు రక్తపీడనం ఎక్కువవుతుంది. అందుకే స్నానానికి ముందు గ్లాసు వేడి నీళ్లు తాగాలి. దాంతో రక్తనాళాలు వ్యాకోచించి, రక్తపీడనం తగ్గుతుంది.