కురులకు వాల్‌నట్‌ ఆయిల్‌!

ABN , First Publish Date - 2020-12-17T18:27:58+05:30 IST

కేశాల సంరక్షణ, నిండుదనం కోసం కొబ్బరి, ఆలివ్‌, వేప నూనెలు చక్కగా పనిచేస్తాయని తెలుసు. వాటి జాబితాలో ఇప్పుడు వాల్‌నట్‌ ఆయిల్‌ చేరింది. వాల్‌నట్‌ ఆయిల్‌లోని ఒమేగా

కురులకు వాల్‌నట్‌ ఆయిల్‌!

ఆంధ్రజ్యోతి(17-12-2020)

కేశాల సంరక్షణ, నిండుదనం కోసం కొబ్బరి, ఆలివ్‌, వేప నూనెలు చక్కగా పనిచేస్తాయని తెలుసు. వాటి జాబితాలో ఇప్పుడు వాల్‌నట్‌ ఆయిల్‌ చేరింది. వాల్‌నట్‌ ఆయిల్‌లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. కురుల అందాన్ని పెంచుతాయి.


 వాల్‌నట్‌లో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. తరచుగా తలకు వాల్‌నట్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉండడంతో పాటు, చుండ్రు తగ్గిపోతుంది.


 వాల్‌నట్‌ ఆయిల్‌ దెబ్బతిన్న, చిట్లిపోయిన కురులకు పోషణనిచ్చి, వాటిని దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. 


 ఈ నూనెలోని పొటాషియం కొత్త కణాలను పునరుద్దరిస్తుంది. దాంతో కురులు నిండుగా పెరిగేలా చేస్తుంది. 
Updated Date - 2020-12-17T18:27:58+05:30 IST