మందారం మేలు!

ABN , First Publish Date - 2020-06-22T19:11:39+05:30 IST

చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలకు మందారం బాగా పనిచేస్తుంది. అదెలాగంటే..

మందారం మేలు!

ఆంధ్రజ్యోతి(22-06-2020)

చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలకు మందారం బాగా పనిచేస్తుంది. అదెలాగంటే..

 

పొడిజుట్టుకు మందారం కండిషనర్‌గా పనిచేస్తుంది. శిరోజాలకు తేమ అందిస్తుంది. సగం కప్పు నీళ్లలో రెండు మందారపువ్వులను వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత అందులో టేబుల్‌స్పూన్ కొబ్బరినూనె, పెరుగు, రెండు చుక్కలు లావెండర్ నూనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల తరువాత షాంపుతో శుభ్రరంగా కడిగేయాలి.


చుండ్రు సమస్య తగ్గేందుకు కొన్ని మందార పువ్వులు, మందార ఆకులను రోటిలో మెత్తని పేస్టులా చేయాలి. ఈ పేస్టుకు టేబుల్ స్పూను పెరుగు, కలబంద గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకొని 20 నిమిషాల తర్వాత షాంపుతో శుభ్రంగా కడుక్కోవాలి. 


కొన్ని మందార ఆకులు, ఒక ఉల్లిపాయ, కలబంద గుజ్జును పేస్టులా చేయాలి. ఆ పేస్టులో రెండు చుక్కలు రోజ్‌మేరీ ఆయిల్, ఒక చుక్క లావెండర్ నూనె వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అరగంట తరువాత షాంపుతో వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

Updated Date - 2020-06-22T19:11:39+05:30 IST