మొటిమల మచ్చలు పోవాలంటే..!

ABN , First Publish Date - 2020-10-03T16:55:32+05:30 IST

మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు ముఖ కాంతిని దెబ్బతీస్తాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఆ మచ్చలను పోగొట్టవచ్చు.

మొటిమల మచ్చలు పోవాలంటే..!

ఆంధ్రజ్యోతి(03-10-2020)

మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు ముఖ కాంతిని దెబ్బతీస్తాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఆ మచ్చలను పోగొట్టవచ్చు.


ఒక చిన్నసైజు దోసకాయ, ఒక కప్పు ఓట్‌మీల్‌ను తీసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.  ఇందులో నుంచి కొంచెం పేస్టు తీసుకుని దానికి ఒక టీస్పూన్‌ పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.


కొన్ని నారింజ తొక్కలను పేస్టులా చేసి ముఖంపై మొటిమలున్న చోట అప్లై చేయాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత కడిగేసుకోవాలి. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.


కలబంద మచ్చలను పోగొట్టడంలోనూ సమర్ధవంతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జును మొటిమలున్న చోట రాస్తే సరిపోతుంది.


మూడు టేబుల్‌స్పూన్ల షుగర్‌, ఒక టేబుల్‌స్పూన్‌ మిల్క్‌ పౌడర్‌, ఒక టేబుల్‌స్పూన్‌ తేనే కలిపి ఆ మిశ్రమంతో ముఖంపై మెల్లగా మర్ధన  చేయాలి. పావుగంట తరువాత నీటితో కడిగేసుకోవాలి.


తాజా బొప్పాయి పండును తీసుకుని గుజ్జుగా చేసి ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారానికి ఒకరోజు ఇలా చేయాలి. 


గ్రేప్స్‌ని రెండు ముక్కలుగా కట్‌ చేసి వాటితో ముఖంపై నెమ్మదిగా రబ్‌ చేయాలి. తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.


టొమాటోలో నేచురల్‌ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. టొమాటోను రెండు ముక్కలుగా కట్‌ చేసి మొటిమలున్న చోట పెట్టాలి. రోజులో రెండు సార్లు ఇలా చేయడం వల్ల మొటిమలు మాయమవుతాయి.

Updated Date - 2020-10-03T16:55:32+05:30 IST