ఇలా చేస్తే ‘అధర’హోనే!

ABN , First Publish Date - 2020-12-07T17:14:04+05:30 IST

ముఖారవిందం అదరాలంటే... అధరం దొండ పండులా మెరవాలి. మరి దాని కోసం ఏం చేయాలి? మార్కెట్‌లో దొరికే ఓ లిప్‌స్టిక్‌ తీసుకొచ్చేసి... పూసుకొంటే సరిపోదు. అలా చేస్తే ఉన్న అందం పోయి

ఇలా చేస్తే ‘అధర’హోనే!

ఆంధ్రజ్యోతి(07-12-2020)

ముఖారవిందం అదరాలంటే... అధరం దొండ పండులా మెరవాలి. మరి దాని కోసం ఏం చేయాలి? మార్కెట్‌లో దొరికే ఓ లిప్‌స్టిక్‌ తీసుకొచ్చేసి... పూసుకొంటే సరిపోదు. అలా చేస్తే ఉన్న అందం పోయి, వయసుకు మించి కనిపిస్తారు. అందుకే మన పెదాలకు నప్పేది... సున్నితమైన చర్మానికి హాని చేయనిది ఎంచుకోవాలనేది బ్యూటీషియన్ల మాట. అందుకు వారిస్తున్న ఈ టిప్స్‌ ఫాలో అయ్యి... ‘అధర’హో అనిపించుకోండి... 


అలాగే అద్దవద్దు: మన పెదాలపై సున్నితమైన చర్మం ఉంటుంది. కనుక ఎక్కువ తేమను సంగ్రహించలేవు. దీంతో పెదాలు పొడిబారి పెచ్చుల్లా వస్తాయి. అది గమనించకుండా లిప్‌స్టిక్‌ వేసుకొంటే... మృదుత్వం పోయి, ముఖం మరింత కళావిహీనంగా తయారవుతుంది. అలాంటప్పుడు లిప్‌ స్క్రబ్‌తో మీ పెదాలను మృదువుగా చేసుకోండి. లేదంటే పెదాలపై వ్యాజ్‌లైన్‌ రాసి, బేబీ టూత్‌బ్ర్‌షతో నిదానంగా రుద్దితే పొడిబారిన చర్మం తొలగిపోతుంది. ఆ తరువాత లిప్‌స్టిక్‌ ఉపయోగిస్తే పెదాలు చూడచక్కగా ఉంటాయి. 


పొడిబారనీయద్దు: అప్పుడప్పుడూ కాకుండా పెదాల పోషణపై కూడా రోజూ శ్రద్ధ పెట్టాలి. పొడిబారకుండా మాయిశ్చరైజింగ్‌ చేస్తుండాలి. సాధారణంగా చాలా లిప్‌స్టిక్స్‌ మాయిశ్చరైజర్లుగా కూడా ఉపయోగపడతాయి. అలా కాని పక్షంలో లిప్‌బామ్‌ తీసుకోండి. అందులోని కొబ్బరి నూనె, వెన్న వంటివి మంచి మాయిశ్చరైజర్లుగా ఉపయోగపడతాయి. అలాంటిదే మరో ఉత్పత్తి లిప్‌ స్లీపింగ్‌ మాస్క్‌. పగిలినట్టుండే పెదాలను సజీవంగా మారుస్తుంది. 


లిప్‌ లైనర్‌: లిప్‌ లైనర్లు వయసు మళ్లిన మహిళలకే అనుకొంటే పొరపాటే. నిజానికి లిప్‌ లైనర్‌ మీ పెదాల అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. అధరాలు కొట్టొచ్చినట్టు కనిపించడానికి హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టి్‌స్టలు కూడా తరచూ లిప్‌ లైనర్లు వాడుతుంటారు. అయితే మీ పెదాల రంగును బట్టే షేడ్స్‌ ఉపయోగిస్తే సరిగ్గా నప్పుతుంది. ఒకవేళ మీ పెదాలు విశాలంగా కనిపించాలంటే న్యూడ్‌ కలర్‌ షేడ్‌ అద్దాలి.


అతిగా వద్దు: ఒకవేళ లిప్‌స్టిక్‌ ఎక్కువైందనిపిస్తే... టిష్యూతో పైపైన అద్ది తొలగించవచ్చు. లేదంటే మూసివున్న పెదాల మధ్యలో నుంచి మీ వేలిని నోట్లో పెట్టి, నిదానంగా బయటకు లాగండి. అప్పుడు అదనంగా అద్దిన లిప్‌స్టిక్‌ మీ వేలికి అంటుకుని వచ్చేస్తుంది. 


రబ్‌ చేయండి: లిప్‌స్టిక్‌ వేసుకున్న తరువాత దానిపై మృదువుగా రుద్దండి. దానివల్ల లిప్‌స్టిక్‌ పెదవంతా ఒకేలా అంటుకుంటుంది. మరింత వైబ్రెంట్‌గా కనిపిస్తుంది. 

Updated Date - 2020-12-07T17:14:04+05:30 IST