జలుబు, దగ్గు, జ్వరమే కాదు.. ఇవీ కొవిడ్ లక్షణాలే!
ABN , First Publish Date - 2020-11-24T16:46:28+05:30 IST
దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, ఊపిరి అందకపోవడం... ఈ ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని భిన్నమైన లక్షణాలనూ కొవిడ్ సమయంలో గమనించాలి. అవేమిటంటే...

ఆంధ్రజ్యోతి (24-11-2020): దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, ఊపిరి అందకపోవడం... ఈ ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని భిన్నమైన లక్షణాలనూ కొవిడ్ సమయంలో గమనించాలి. అవేమిటంటే....
జీర్ణసంబంధమైనవి: కరోనా వైరస్ తీవ్రమైన జీర్ణసంబంధ సమస్యలను కలిగిస్తుంది. పొట్టలో నొప్పి, డయేరియా, వాంతులు, మలబద్ధకంతో పాటు ఇతరత్రా జీర్ణవ్యవస్థ సంబంధిత ఇబ్బందుల రూపంలో కరోనా బయల్పడే వీలుంది.
కంటి ఇన్ఫెక్షన్: కరోనా కళ్లకలక రూపంలో కూడా బయల్పడవచ్చు. కనుగుడ్డులోని తెల్లని ప్రదేశం ఎర్రబారి, వాచడం, దురద పెట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.
అయోమయం: అయోమయానికి లోనవడం, కన్ఫ్యూజన్కు గురి కావడం, ఆలోచనల్లో స్పష్టత లోపించడం కూడా కరోనా లక్షణాలే!
కాబట్టి కరోనా విస్తరించి ఉన్న సమయంలో ఏ చిన్న అనారోగ్య లక్షణాన్నీ అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రతించాలి. అలాగే మాస్క్‌లను వాడుతూ, సామాజిక దూరం పాటించాలి. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.