చెవిలో హోరు!

ABN , First Publish Date - 2020-11-10T17:32:09+05:30 IST

అకారణంగా చెవిలో శబ్దాలు వినిపించే సమస్య ‘టిన్నిటస్‌’! కొవిడ్‌ సోకినప్పుడు మిగతా లక్షణాలతో పాటు టిన్నిటస్‌ కూడా పెరుగుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. మరికొందరిలో ‘లాంగ్‌ కొవిడ్‌’

చెవిలో హోరు!

ఆంధ్రజ్యోతి(10-11-2020)

అకారణంగా చెవిలో శబ్దాలు వినిపించే సమస్య ‘టిన్నిటస్‌’! కొవిడ్‌ సోకినప్పుడు మిగతా లక్షణాలతో పాటు టిన్నిటస్‌ కూడా పెరుగుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. మరికొందరిలో ‘లాంగ్‌ కొవిడ్‌’ లక్షణాల్లో భాగంగా టిన్నిటస్‌ దీర్ఘకాలం పాటు వేధించే అవకాశాలు కూడా లేకపోలేదని వైద్యులు అంటున్నారు. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితం కావడం మూలంగా ఎక్కువ సార్లు వీడియో కాల్స్‌ మాట్లాడుతూ ఉండడం, పిల్లల ఆన్‌లైన్‌ పాఠాలు, ఇంట్లో ఉండే ఇతరత్రా శబ్దాలు, మానసిక ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం.... ఇలా భిన్న కారణాల వల్ల కూడా టిన్నిటస్‌ పెరిగే వీలు కూడా ఉంది.


టిన్నిటస్‌ను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించకపోతే, అది మరింత తీవ్రమై మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా కొవిడ్‌ కాలంలో టిన్నిటస్‌కు సంబంధించిన ఏ లక్షణాన్నీ అలక్ష్యం చేయకుండా, వెంటనే వైద్యుల దృష్టికి తీసుకురావడం అవసరం అంటున్నారు వైద్యులు.

Read more