యవ్వన చర్మానికి సిల్క్‌ పౌడర్‌

ABN , First Publish Date - 2020-09-24T17:51:34+05:30 IST

చర్మతత్వానికి సరిపడే సౌందర్య ఉత్పత్తులు ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. అన్నిరకాల చర్మాలకు ఒకేరకం బ్యూటీ ప్రొడక్ట్స్‌ సరిపోవు. అయితే నాణ్యమైన పట్టు నుంచి

యవ్వన చర్మానికి సిల్క్‌ పౌడర్‌

ఆంధ్రజ్యోతి(24-09-2020)

చర్మతత్వానికి సరిపడే సౌందర్య ఉత్పత్తులు ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. అన్నిరకాల చర్మాలకు ఒకేరకం బ్యూటీ ప్రొడక్ట్స్‌ సరిపోవు. అయితే నాణ్యమైన పట్టు నుంచి తయారు చేసిన సిల్క్‌ పౌడర్‌ మాత్రం అన్నిరకాల చర్మాలకు చక్కగా సరిపోతుంది. దీనిలో చర్మానికి మేలు చేసే ‘ఫైబ్రాయిన్‌ ప్రొటీన్‌’ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖరీదైన మేకప్‌ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే సిల్క్‌ పౌడర్‌ ఉపయోగాలివి. 


సిల్క్‌ పౌడర్‌ చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా ఉంచుతుంది. తీరిక దొరకపోవడంతో చర్మ సంరక్షణ మీద అంతగా దృష్టి పెట్టం. అయితే సిల్క్‌ పౌడర్‌ ఉన్న సౌందర్య సాధనాలను వాడడం వల్లం చర్మం సాగేగుణం పెరుగుతుంది. దాంతో కళ్లు, నోటి చుట్టూ ఏర్పడే గీతలు తగ్గిపోతాయి.


కొందరిలో స్కిన్‌ ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య ఉంటుంది. సున్నితమైన చర్మం, మూసుకుపోయిన చర్మ రంధ్రాలు ఉన్న వారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. సిల్క్‌ పౌడర్‌లోని ప్రొటీన్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి చర్మానికి సాంత్వననిస్తుంది.


ముఖం మీద ఏర్పడే లేత రంగు మచ్చలు కొన్ని కొంతకాలానికి కనిపించవు. కానీ కొన్ని అలాగే ఉండిపోతాయి. సిల్క్‌ పౌడర్‌ ఈ మచ్చలను పోగొడుతుంది. ముఖ్యంగా ముదురు రంగులో ఉన్న మచ్చలను తొలగిస్తుంది.


Read more