ఎండదెబ్బ తగలకుండా...

ABN , First Publish Date - 2020-05-26T16:04:00+05:30 IST

ఎండ వేడికి ఆవిరయ్యే ఒంట్లోని నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ఉంటే ఎండదెబ్బకు గురికాకుండా ఉంటాం! ఇందుకోసం కేవలం నీళ్లు తాగితే సరిపోదు. చెమట ద్వారా కోల్పోయే లవణాలనూ భర్తీ చేస్తూ ఉండాలి.

ఎండదెబ్బ తగలకుండా...

ఆంధ్రజ్యోతి(26-05-2020)

ఎండ వేడికి ఆవిరయ్యే ఒంట్లోని నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ఉంటే ఎండదెబ్బకు గురికాకుండా ఉంటాం! ఇందుకోసం కేవలం నీళ్లు తాగితే సరిపోదు. చెమట ద్వారా కోల్పోయే లవణాలనూ భర్తీ చేస్తూ ఉండాలి.


రీహైడ్రేటింగ్‌ సొల్యూషన్‌: వేసవిలో ఎక్కువ సమయం పాటు ఆరుబయట ఉండవలసి వస్తే, వెంట నీళ్లతో పాటు రీహైడ్రేటింగ్‌ సొల్యూషన్‌ను కూడా తీసుకువెళ్లాలి. పావు లీటరు నీళ్లలో ఒక టీస్పూను చక్కెర, రెండు చిటికెల ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు కలిపి సొల్యూషన్‌ తయారుచేసుకోవాలి. ఈ పానీయాన్ని తరచుగా సేవిస్తూ ఉంటే, ఎండదెబ్బకు గురి కాకుండా ఉంటాం. అలాగే ఇవే పదార్థాలను పళ్లరసాల్లో కలిపి కూడా సేవించవచ్చు. ఉప్పు శరీరం నుంచి లవణాలు బయటకు వెళ్లిపోకుండా నియంత్రిస్తుంది. ఎండ వేడిమికి శరీరం కోల్పోయే శక్తి చక్కెరతో భర్తీ అవుతుంది. సోడా ఉప్పు లవణాలను శరీరం సమర్థంగా శోషించుకునేందుకు తోడ్పడుతుంది. ఇలా రీహైడ్రేటింగ్‌ సొల్యూషన్‌ ద్వారా అందే ఉప్పు, సోడా ఉప్పు, చక్కెరలు ఎండదెబ్బకు గురికాకుండా శరీరానికి రక్షణ కల్పిస్తాయి. 


చింతపండు రసం: చింతపండులో ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎలకొ్ట్రలైట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మరిగించిన నీటిలో చింతపండు నానబెట్టి, వడగట్టి, చిటికెడు చక్కెర కలుపుకొని తాగాలి. ఈ కషాయం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

Updated Date - 2020-05-26T16:04:00+05:30 IST