సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ ఇలా..

ABN , First Publish Date - 2020-09-01T16:31:06+05:30 IST

సీజనల్‌ వ్యాధులు ప్రబలే కాలం ఇది. జలుబు, దగ్గు, ఫ్లూ సాధారణం. అయితే ఈ కరోనా కాలంలో వాటిని నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు వైద్య నిపుణులు.

సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ ఇలా..

ఆంధ్రజ్యోతి(01-09-2020): సీజనల్‌ వ్యాధులు ప్రబలే కాలం ఇది. జలుబు, దగ్గు, ఫ్లూ సాధారణం. అయితే ఈ కరోనా కాలంలో వాటిని నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఈ వ్యాధుల బారిన పడకుండా కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఇంటి వైద్యాన్ని సూచించింది. ఆ సూచనలు మీ కోసం... 


గోల్డెన్‌ మిల్క్‌: పసుపు పాలు... ఇప్పుడు దీన్నే ‘గోల్డెన్‌ మిల్క్‌’ అని కూడా అంటున్నారు. వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది పరమౌషధంలా పనిచేస్తుంది. హానికర బ్యాక్టీరియాను నియంత్రించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. కొవిడ్‌ పేషెంట్లకు కొన్ని ఆసుపత్రులు పసుపు వేసిన పాలను ఇస్తున్నాయి. కారణం... ఇందులో ఉండే యాంటీ బయాటిక్స్‌, యాంటీసెప్టిక్‌ గుణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. 


స్టీమ్‌: ముఖానికి ఆవిరి పట్టడం. ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడంలో స్టీమ్‌ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జలుబు లక్షణాలు ఉన్నవారికి మంచి ఫలితాన్నిస్తుంది. వేడి నీటిలో టీ ట్రీ ఆయిల్‌ లేదంటే నీలగిరి, పుదీనా ఆకులో, అమృతాంజనమో వేసి ఆవిరి పట్టాలి. ఆవిరి ముక్కులోకి వెళ్లినప్పుడు శ్వాసకు ఇబ్బంది కలిగిస్తున్న బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఫ్లూ, సాధారణ జలుబు, లక్షణాలున్నవారు కూడా రోజూ ఆవిరి పడితే ప్రయోజనకరంగా ఉంటుంది. 


పేస్ట్‌: గొంతు నొప్పి ఉన్నవారు పుదీనా, వాము ఆకులు, నీలగిరి కలిపి పేస్టులా చేసుకొని, మెడపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. దాదాపు అన్ని ఆయుర్వేద షాపుల్లో ఈ పేస్టు లభిస్తుంది.


ఒకవేళ ఈ లక్షణాలుంటే.. 

మహమ్మారి విస్తరిస్తున్న ఈ కాలంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడితే కరోనా వైరస్‌ సోకే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఒకవేళ మీకు ఈ లక్షణాలుంటే వెంటనే అప్రమత్తమవ్వండి... 


శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 

ముక్కు దిబ్బడ (బ్లాక్‌డ్‌ నోస్‌) 

దగ్గు 

ఒళ్లు నొప్పులు 

తలనొప్పి

Updated Date - 2020-09-01T16:31:06+05:30 IST