కండరాలు పట్టేస్తుంటే..!
ABN , First Publish Date - 2020-12-03T16:44:29+05:30 IST
కండరాలు పట్టేయడం చాలామందిలో కనిపించే సమస్య. కండరాలు పట్టేస్తున్నాయంటే(మజిల్ క్రాంప్స్) శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదని అర్థం.

ఆంధ్రజ్యోతి(03-12-2020)
కండరాలు పట్టేయడం చాలామందిలో కనిపించే సమస్య. కండరాలు పట్టేస్తున్నాయంటే(మజిల్ క్రాంప్స్) శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదని అర్థం.
టెన్నిస్, స్విమ్మింగ్, వాకింగ్ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేస్తుంటాయి. అలాకాకుండా కొంతమందికి రాత్రుళ్లు నిద్రలో కూడా పట్టేస్తుంటాయి.
కండరాలు పట్టేయడానికి కారణాలు చాలానే. డీహైడ్రేషన్, ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవడం, శరీరంలో క్యాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం లవణాల శాతం తగ్గిపోవడం కారణం కావచ్చు. గర్భిణిలలో, వెన్ను నరంపై ఒత్తిడి పడినప్పుడు, కిడ్నీ ఫెయిల్యూర్, హైఫోథైరాయిడిజం వంటి సందర్భాల్లో కూడా కండరాలు పట్టేసే వీలుంది. కొందరిలో ఇతర జబ్బులకు వాడే మందులు కారణం అవుతాయి.
కండరాలు పట్టేయడాన్ని దూరం చేసుకోవాలంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం లేకుండా జాగ్రత్తపడాలి.
వ్యాయామం చేసే ముందు వామప్ చేయడం మరువద్దు. ఒకవేళ వ్యాయామం చేసే సమయంలో కండరం పట్టేస్తే నెమ్మదిగా మసాజ్ చేయాలి.
కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. కాఫీ, చాక్లెట్ వంటివి ఎక్కువ తీసుకోకూడదు. డీహైడ్రేషన్ రాకుండా తరచుగా నీళ్లు తాగాలి.
పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమస్య ఎక్కువగా ఉంటే డాక్టరును సంప్రదించి విటమిన్ మాత్రలు తీసుకోవాలి.
కొన్ని రకాల మందుల వల్ల శరీరంలో మెగ్నీషియం, పొటాషియం లవణాల శాతం తగ్గిపోతుంది. మీరు రోజూ వాడుతున్న మందులలో అలాంటి మెడిసిన్స్ ఉన్నాయేమో డాక్టర్ను అడిగి తెలుసుకోవాలి.