నిద్ర తగ్గితే కష్టమే!
ABN , First Publish Date - 2020-06-15T18:26:35+05:30 IST
రాత్రిళ్లు ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ఎక్కువ కాలం కొనసాగితే పగటిపూట నిద్రమత్తు వదలదు.
ఆంధ్రజ్యోతి(15-06--2020)
రాత్రిళ్లు ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ఎక్కువ కాలం కొనసాగితే పగటిపూట నిద్రమత్తు వదలదు.
రోజూ 6 గంటలు నిద్రపోతున్నారా, 10 గంటలు నిద్రపోతున్నారా అనేది సమస్య కాదు. ఆలస్యంగా పడుకుంటే జీవ గడియారం దెబ్బతింటుంది కాబట్టి వేళకు నిద్రపోవాలి.
మంచి నిద్ర పట్టాలంటే..!
కెఫిన్‌కు దూరం- సాయంత్రం 4 తరువాత టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దు.
ఆహారం- మానసికంగా ఆరోగ్యంగా ఉంటే పేగుల పనితీరు బాగుంటుంది. శుచిగా ఉండే ఆహారమే తినాలి.
దీర్ఘశ్వాస- పడుకునేముందు దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గి త్వరగా నిద్రపడుతుంది.
చురుగ్గా ఉండండి- డ్యాన్స్, నడక, వ్యాయామం లాంటివి రోజూ 30 నిమిషాల పాటు చేయాలి.
ఫోన్‌కు దూరం - నిద్రకు రెండు గంటల ముందుగానే ఫోను పక్కన పెట్టేయాలి, సోషల్ మీడియాకు దూరం ఉండాలి.