కొవిడ్‌ పని పట్టే కబాసుర కుడినీర్

ABN , First Publish Date - 2020-12-01T16:57:38+05:30 IST

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వ్యాధి చికిత్సలో పెద్ద ముందడుగు పడబోతోంది. ఈ వ్యాధి నివారణలో సిద్ధ వైద్యం ఆశాకిరణంలా కనిపిస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో

కొవిడ్‌ పని పట్టే కబాసుర కుడినీర్

ఆంధ్రజ్యోతి(01-12-2020)

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వ్యాధి చికిత్సలో పెద్ద ముందడుగు పడబోతోంది. ఈ వ్యాధి నివారణలో సిద్ధ వైద్యం ఆశాకిరణంలా కనిపిస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో కొవిడ్‌ చికిత్సలో భాగంగా కొద్దిపాటి కొవిడ్‌ లక్షణాలు కలిగి ఉన్న బాధితులకు ఇతర ఆయుష్‌ ఔషధాలతో పాటు యాడ్‌ ఆన్‌ థెరపీలో భాగంగా అందిస్తున్న ‘కబాసుర కుడినీర్‌’ మంచి ఫలితాలు ఇస్తున్నట్టు తేలింది.


ప్రస్తుతం సిద్ధ వైద్య ఔషధాలతో చేస్తున్న ప్రయోగాల్లో కబాసుర కుడినీర్‌ మాత్రలతో పాటు టర్మరిక్‌ ప్లస్‌ మాత్రలు, శక్తి డ్రాప్స్‌ కూడా బాధితులకు అందజేస్తున్నారు. రోజుల పాటు అందించిన ఈ ఔషధాలు కొవిడ్‌ బాధితుల్లో ఇప్పటివరకూ మెరుగైన ఫలితాలనే వచ్చాయంటున్నాయి సంబంధిత వర్గాలు. ఈ సిద్ధ వైద్య ఔషధాల పరిశోధన, తయారీలో శ్రీశ్రీ రవిశంకర్‌ నేతృత్వంలోని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ కూడా కీలక పాత్రను పోషిస్తోంది. ఈ ప్రయోగాల గురించీ, వాటి ప్రాథమిక ఫలితాల గురించీ సోమవారం నిర్వహించిన ఒక వెబ్‌నార్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌ వెల్లడించారు. మరోవైపుజర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్ట్‌ బయోటెక్నాలజీ ఇన్నొవేటివ్‌ సెంటర్‌లోని పరిశోధకులు కూడా కొవిడ్‌పై పోరాటంలో భాగంగా సిద్ధ వైద్యంపై చేపట్టిన రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టియన్‌ గార్టే ప్రకటించారు.
Updated Date - 2020-12-01T16:57:38+05:30 IST