మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా?
ABN , First Publish Date - 2020-04-07T15:02:51+05:30 IST
కొందరికి ఒకసారి వచ్చిన కరోనా ఇన్‌ఫెక్షన్ చికిత్సతో తగ్గినట్టు కనిపించినా, మళ్లీ తిరగబెడుతూ ఉంటుంది. ఇలా మన దేశంతో పాటు, చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో కొన్ని సందర్భాల్లో రుజువైంది. ఇలాంటి రీ ఇన్‌ఫెక్షన్ ఎందుకు వస్తోంది?

ఆంధ్రజ్యోతి(07-04-2020)
కొందరికి ఒకసారి వచ్చిన కరోనా ఇన్‌ఫెక్షన్ చికిత్సతో తగ్గినట్టు కనిపించినా, మళ్లీ తిరగబెడుతూ ఉంటుంది. ఇలా మన దేశంతో పాటు, చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో కొన్ని సందర్భాల్లో రుజువైంది. ఇలాంటి రీ ఇన్‌ఫెక్షన్ ఎందుకు వస్తోంది?
కొందరు కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్సతో అంతిమంగా నెగటివ్ ఫలితం పొందినా, కొద్ది రోజులకే మళ్లీ పాజిటివ్‌గా తేలుతూ ఉంటారు. ఇందుకు కారణం వారికి కరోనా వైరస్ మళ్లీ సోకింది అనుకుంటే పొరపాటు. నిజానికి శరీరంలో దాగిన వైరస్, చికిత్స తర్వాత జరిపే పరీక్షల్లో దొరకకకపోవడమే ఇందుకు అసలైన కారణం.
పరీక్ష కోసం సేకరించిన స్పెసిమెన్ నాణ్యత తక్కువగా ఉన్నా నెగటివ్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ మెడికల్ బ్రాంచ్‌కు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ వినీత్. ఎలాంటి వైరస్ సోకినా, పది రోజుల వరకూ శరీరంలో తయారయ్యే యాంటీబాడీస్ వైరస్‌తో పోరాడుతూనే ఉంటాయనీ, ఫలితంగా శరీరంలో వైరస్ సమూలంగా నశించకపోయినా, పరీక్ష చేసినప్పుడు ఫలితం నెగటివ్‌గా వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఆయన అంటున్నారు. కాబట్టి పదే పదే పాజిటివ్ ఫలితం వస్తే, దాన్ని రీ ఇన్‌ఫెక్షన్‌గా భావించకూడదు అని అంటున్నారాయన.