కొత్తిమీరతో అందం

ABN , First Publish Date - 2020-05-13T16:47:44+05:30 IST

జీర్ణక్రియకు తోడ్పడే కొత్తిమీరలో సౌందర్య గుణాలు ఎక్కువే. కొత్తిమీర పేస్ట్‌ను ప్యాక్‌లా వేసుకుంటే ముఖం మీది గీతలు మాయం అవుతాయి. పొడిబారిన పెదవులు తాజాగా మెరుస్తాయి. లాక్‌డౌన్‌ వేళ కొత్తిమీరతో అందానికి మెరుగులు దిద్దుకోండిలా...

కొత్తిమీరతో అందం

ఆంధ్రజ్యోతి(13-05-2020):

జీర్ణక్రియకు తోడ్పడే కొత్తిమీరలో సౌందర్య గుణాలు ఎక్కువే. కొత్తిమీర పేస్ట్‌ను ప్యాక్‌లా వేసుకుంటే ముఖం మీది గీతలు  మాయం అవుతాయి. పొడిబారిన పెదవులు తాజాగా మెరుస్తాయి. లాక్‌డౌన్‌ వేళ కొత్తిమీరతో అందానికి మెరుగులు దిద్దుకోండిలా...


ముఖం కాంతిమంతం: కొత్తిమీర పేస్టులో టీ స్పూన్‌ కలబంద గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొత్తిమీరలోని విటమిన్‌ ఎ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. వారంలో రెండు సార్లు ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది. 


చర్మానికి సాంత్వన: కొత్తిమీరలోని విటమిన్‌ సి ఫ్రీరాడికల్స్‌ చర్మం మీది మలినాలను తొలగిస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మానికి సాంత్వననిస్తాయి. ముల్తానీ మట్టి, టొమాటోగుజ్జు, నిమ్మరసం కలిపిన కొత్తిమీర పేస్ట్‌ను ముఖానికి రాసుకుని పది నిమిషాలయ్యాక నీళ్లతో కడుక్కోవాలి.


మృతకణాలు మాయం: ధనియాలు చక్కని స్క్రబ్బర్‌లా పనిచేస్తాయి. ధనియాల పేస్ట్‌ను చర్మానికి రాసుకుంటే మృతకణాలు వదులుతాయి. వీటిలోని విటమిన్లు చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి. కొత్తిమీర పేస్ట్‌లో, ముద్దచేసుకున్న ఓట్స్‌, గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తరువాత వెచ్చని తువ్వాలుతో తుడుచుకోవాలి.


పెదవులు తాజాగా: కొత్తిమీర లిప్‌బామ్‌లా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల కొత్తిమీర పేస్ట్‌లో, టీ స్పూన్‌ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారిన పెదవుల మీద రాసుకోవాలి. ఇలాచేస్తే మీది మృతకణాలు వదిలి పెదవులు తాజాగా కనిపిస్తాయి.

Updated Date - 2020-05-13T16:47:44+05:30 IST