ఈ వాసనలు తెలియకపోతే?
ABN , First Publish Date - 2020-10-13T17:06:50+05:30 IST
వాసన, రుచి కోల్పోవడం కరోనా ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాల్లో కొన్ని. ఈ లక్షణాలను వైద్యపరిభాషలో ‘అనోస్మియా’ అంటారు. ఈ స్థితిలో ఎటువంటి వాసనలనూ కనిపెట్టే వీలు ఉండదు. అయితే అనోస్మియా స్థితిని నిర్థారించుకోవడానికి పరిశోధకులు

ఆంధ్రజ్యోతి(13-10-2020): వాసన, రుచి కోల్పోవడం కరోనా ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాల్లో కొన్ని. ఈ లక్షణాలను వైద్యపరిభాషలో ‘అనోస్మియా’ అంటారు. ఈ స్థితిలో ఎటువంటి వాసనలనూ కనిపెట్టే వీలు ఉండదు. అయితే అనోస్మియా స్థితిని నిర్థారించుకోవడానికి పరిశోధకులు ఓ మార్గాన్ని కనిపెట్టారు. పెప్పర్మింట్ ఆయిల్, కొబ్బరినూనెలు... ఈ రెండు రకాల వాసనలనూ కనిపెట్టలేకపోయినప్పుడు మాత్రమే కొవిడ్ సోకినట్టుగా భావించాలి.
కరోనా లక్షణాల్లో వాసన కోల్పోవడం ప్రధాన లక్షణమే అయినా, ఈ లక్షణానికి ఎవరూ అంతగా ప్రాముఖ్యం ఇవ్వరు. దాంతో వారు పరిస్థితిని తీవ్రంగా పరిగణించరు. ఫలితంగా ఇన్ఫెక్షన్ త్వరితంగా పెరిగి, వారికీ, వారితో పాటు ఇతరులకూ చేటు చేస్తుంది. ఇలా జరిగే వీలు లేకుండా ఉండడం కోసం ఎవరికి వారు తమకున్న అనోస్మియాను నిర్థారించుకునేందుకు వీలుగా పరిశోధకులు కొబ్బరినూనె, పెప్పర్మింట్ ఆయిల్‌లను వాసన చూడమని సలహా ఇస్తున్నారు. ఆ వాసనలను కనిపెట్టలేకపోతే కొవిడ్ సోకినట్టుగా భావించి ఎవరికి వారు ఐసొలేట్ అయిపోయి, కొవిడ్ పరీక్ష చేయించుకుని, తగిన చికిత్స తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.