పిల్లలను హత్తుకుంటున్నారా!

ABN , First Publish Date - 2020-12-05T15:48:33+05:30 IST

ఒకరిపై ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తం చేసేందుకు వారిని గట్టిగా కౌగిలించుకుంటాం. అంతేకాదు అవతలి వారిని హత్తుకోవడం ద్వారా వారికి కష్టసమయాల్లో ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తాం. పిల్లల

పిల్లలను హత్తుకుంటున్నారా!

ఒకరిపై ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తం చేసేందుకు వారిని గట్టిగా కౌగిలించుకుంటాం. అంతేకాదు అవతలి వారిని హత్తుకోవడం ద్వారా వారికి కష్టసమయాల్లో ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తాం. పిల్లల విషయంలో కౌగిలింత అద్భుతంగా పనిచేస్తుంది. వారి వికాసానికి తోడ్పడుతుంది అంటున్నారు మానసిక నిపుణులు. వారు ఏం చెబుతున్నారంటే...


తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకొని హత్తుకుంటే వారు చక్కగా ఎదుగుతారు. తమకు ఏ కష్టం వచ్చినా వెన్ను తట్టే వారు ఉన్నారనే నమ్మకం వారిలో బలపడుతుంది.

పిల్ల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం ఒక్కటే సరిపోదు. తల్లిదండ్రులు తరచూ కౌగిలించుకునే పిల్లల్లో మెదడు పనితీరు, తెలివితేటలు, ఆలోచనా శక్తి పెరిగినట్టు 2016లో ఒక యూరోపియన్‌ అధ్యయనం వెల్లడించింది.

ఒక్కోసారి పిల్లల ప్రవర్తన కోపం తెప్పిస్తుంది. అప్పుడు వారిని తిట్టడం, కొట్టడం కాకుండా ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. దాంతో వారిలో ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ విడుదలయ్యి వారి మూడ్‌ను మార్చేస్తుంది. 

నమ్మరు గానీ కౌగిలింత రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు, వారికి గాయం అయినప్పుడు వారిని కౌగిలించుకుంటే తొందరగా కోలుకుంటారు. 

పిల్లలను అభినందిస్తూ కౌగిలించుకుంటే వారు ఎంతో పొంగిపోతారు. వారిలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. 

కుటుంబసభ్యుల కౌగిలింతలు, ప్రేమను పొందే పిల్లలలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం, మంచి నడవడిక వంటి లక్షణాలు అలవడతాయి.


Updated Date - 2020-12-05T15:48:33+05:30 IST