నల్లటి వలయాలు ఇలా మాయం!

ABN , First Publish Date - 2020-09-14T20:40:23+05:30 IST

కళ్ల దగ్గర చర్మం పలచగా ఉంటుంది. సూర్యరశ్మిలోని హానికర కిరణాలు కళ్ల దగ్గరి చర్మాన్ని తొందరగా ముడతలు పడేలా చేస్తాయి. అలానే వయసు పెరుగుతున్న

నల్లటి వలయాలు ఇలా మాయం!

ఆంధ్రజ్యోతి(14-09-2020)

కళ్ల దగ్గర చర్మం పలచగా ఉంటుంది. సూర్యరశ్మిలోని హానికర కిరణాలు కళ్ల దగ్గరి చర్మాన్ని తొందరగా ముడతలు పడేలా చేస్తాయి. అలానే వయసు పెరుగుతున్న కొద్దీ కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు ఇబ్బందిగా అనిపిస్తాయి. వాటిని సహజ పద్ధతిలో వీటిని తొలగించి కళ్లను అందంగా మార్చుకోండిలా...

ఎండలో బయటకు వెళ్లే ముందు కళ్లకు రక్షణగా క్రీమ్‌ రాసుకోవాలి. కళ్ల దగ్గరి చర్మం తేమగా ఉండేలా చూసుకోవాలి.


బంగాళ దుంప: కళ్ల వాపు తగ్గించడంలో బంగాళదంప బెస్ట్‌. దీనిలోని ఎంజైమ్‌లు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, కళ్ల కింది చర్మాన్ని బిగుతుగా చూస్తాయి. బంగాళదుంపను ముక్కలుగా కోసి, వాటి కి పిన్నులు గుచ్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. వీటిని కళ్ల మీద పది నిమిషాల పాటు ఉంచాలి. తరువాత నీళ్లతో శుభ్రం చేసుకొని ఐ క్రీమ్‌ రాసుకోవాలి.


 కీరదోస: దీనిలో చర్మానికి పోషణనిచ్చి, చర్మాన్ని దృఢంగా మార్చే గుణాలున్నాయి. తాజా కీరదోసను సన్న ముక్కలుగా కోసి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. వాటిని కళ్ల మీద 10 నిమిషాలు పెట్టుకోవాలి. దాంతో కళ్ల కింది చర్మానికి రక్తప్రసరణ పెరిగి వలయాలు, మచ్చలు మాయమవుతాయి.


 టొమాటో: వీటిలోని లైకోపిన్‌ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతేకాదు కళ్ల కింది నల్లటి వలయాలను తగ్గిస్తుంది. టొమాటో ముక్కలను కళ్ల మీద పెట్టుకోవాలి. లేదంటే టొమాటో రసం, కలబంద గుజ్జు సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసుకుంటే తేమ అంది కళ్లు తాజాగా కనిపిస్తాయి. 


 చామంతి టీ: యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న ఈ టీ కళ్ల కింది చర్మానికి సాంత్వననిస్తాయి. చామంతి టీ బ్యాగును నీళ్లలో కొద్దిసేపు ఉంచాలి. తరువాత వాటిని ఫ్రిజ్‌లో 30 నిమిషాలు పెట్టాలి. ఈ టీ బ్యాగులను కళ్ల మీద పెట్టుకుంటే కళ్ల దగ్గరి నరాలకు ఉపశమనం లభిస్తుంది.  


Read more