మానవ శరీరంలో కరోనా ప్రవేశించాక పనిచేసే తీరిదే..

ABN , First Publish Date - 2020-04-08T16:02:34+05:30 IST

‘ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక.. గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు! చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడ్రా’ ..‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన ఈ డైలాగ్‌

మానవ శరీరంలో కరోనా ప్రవేశించాక పనిచేసే తీరిదే..

ఆంధ్రజ్యోతి(08-04-2020)

శ్రద్ధగా విధ్వంసం!.. కరోనా పనిచేసే తీరిది

జన్యుక్రమంతో వెల్లడి

‘ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక.. గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు! చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడ్రా’ ..‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన ఈ డైలాగ్‌ గుర్తుందా? ఒక్కసారి మన ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత కరోనా వైరస్‌ కూడా ఇలాగే పద్ధతిగా, పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం తన పని తాను చేసుకుపోతూ మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందట! 


కంటికి కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేయాలంటే దాని ఆనుపానులన్నీ తెలియాలి. దాని పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలి. కరోనా జన్యుక్రమం ద్వారా శాస్త్రజ్ఞులు ఈ వివరాలు తెలుసుకోగలిగారు. సుశిక్షితులైన సైన్యంలా కొవిడ్‌-19 వైర్‌సలోని ప్రొటీన్లు పనిచేసే తీరు.. మన కణాలను దెబ్బతీసే విధానం.. రోగనిరోధక శక్తిని అడ్డుకొనే వ్యూహం నివ్వెరపరిచేలా ఉన్నాయని వారు అంటున్నారు. ఈ ఏడాది జనవరిలో 41 ఏళ్ల ఒక వ్యక్తి నుంచి ఈ వైర్‌సను సేకరించిన శాస్త్రజ్ఞులు దాని జన్యుక్రమాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించి పరిశోధనలు చేశారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. కొవిడ్‌ 19 వైరస్‌ జన్యుక్రమంలో కేవలం మూడు వేల అక్షరాలు (జన్యుపరిభాషలో లెటర్స్‌) మాత్రమే ఉంటాయి. అదే మానవ జన్యుక్రమంలో 300 కోట్ల అక్షరాలుంటాయి. అలాంటి మనను కూడా ఈ వైరస్‌ గడగడలాడిస్తోందంటే దాని వ్యూహం ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలి.


హైజాకర్స్‌.. 

కొవిడ్‌ 19 అయితే.. మన శరీరంలోని కణాల్లోకి తీగలాంటి ఆర్‌ఎన్‌ఏను చొప్పిస్తుంది. ఈ ఆర్‌ఎన్‌ఏలో మొత్తం దాని జన్యుక్రమమంతా ఉంటుంది. తద్వారా వైరస్‌ మన శరీరంలో త్వరత్వరగా వ్యాపించగలుగుతోంది. అయితే మన రోగనిరోధక వ్యవస్థ కూడా వైర్‌సపై పోరాటం చేస్తుంది కదా? దాన్నుంచి ఎలా తప్పించుకుంటుంది? అంటే.. పక్కా ప్రణాళికతో అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కొవిడ్‌-19లో మొత్తం 29 ప్రొటీన్లు ఉంటాయి. ఇవన్నీ ఒక దానితో మరొకటి పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. తొలుత ఆ 29 ప్రొటీన్లలో 16 ప్రొటీన్లు గొలుసుకట్టుగా ఏర్పడి మానవ కణంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వీటిలో ఒక ప్రొటీన్‌ (ఎన్‌ఎ్‌సపీ3) మన కణాలకు శక్తిని అందే మార్గాలను కత్తిరిస్తుంది. ఎన్‌ఎ్‌సపీ 4 అనే ప్రొటీన్‌.. వైరస్‌ చుట్టూ ఒక బుడగలాంటి పదార్థాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనితో రోగనిరోధక శక్తిని అందించే కణాలు వైర్‌సపై దాడి చేయలేవు. ఇక ఎన్‌ఎ్‌సపీ5 అనే ప్రొటీన్‌ గొలుసుకట్టుగా ఉన్న ప్రొటీన్‌లను విడగొడుతుంది. అప్పుడు మిగిలిన ప్రొటీన్లు అన్నీ విడిపోయి తమ తమ పనులు చేసుకోవటం మొదలుపెడతాయి. ముఖ్యంగా.. ఎన్‌ఎ్‌సపీ7, ఎన్‌ఎ్‌సపీ8లు వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ కాపీలను తయారుచేయటం మొదలుపెడతాయి. మన శరీరంలో అతి తక్కువ సమయంలో వైరస్‌ సంఖ్య పెరగటానికి ఇవే కారణం.


కణకేంద్రకంపై దాడి..

ప్రతి కణానికి కేంద్రకం కీలకం. అది బలహీనమైతే కణం చనిపోతుంది. కరోనా వైర్‌సలోని 29 ప్రొటీన్లలో అత్యంత కీలకమైన ఎన్‌ఎ్‌సపీ 9 ఇదే పనిచేస్తుంది. మన కణాల్లోకి ప్రవేశించి కేంద్రకంపై నేరుగా దాడి చేస్తుంది. దీనితో కణంలోని ఇతర ప్రాంతాలకు సంకేతాలు అందవు. ఈ ప్రొటీన్‌ ఒక వైపు దాడి చేస్తుంటే మరో వైపు ఎన్‌ఎ్‌సపీ 10, ఎన్‌ఎ్‌సపీ 16 ప్రొటీన్లు మన రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని తట్టుకొనేలా- వైర్‌సలోని ఆర్‌ఎన్‌ఏను కాపాడుతూ ఉంటాయి. ఇదే సమయంలో ఎన్‌ఎ్‌సపీ 12 ప్రొటీన్లు కొత్త వైర్‌సను తయారుచేస్తూ ఉంటుంది. ఇక్కడ అడ్డుకోగలిగితే వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చనేది శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ ప్రక్రియను అడ్డుకొనే మందులను వైర్‌సపై పరీక్షిస్తున్నారు. 


గొలుసు కట్టు..

కోవిద్‌ 19లో ఉన్న 29 ప్రొటీన్లలో- 16 గొలుసుకట్టుగా ఏర్పడి కణంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వీటిలో ఒక ప్రొటీన్‌ (ఎన్‌ఎ్‌సపీ3 ) మన కణాలకు శక్తిని అందే మార్గాలను కత్తిరిస్తుంది. ఎన్‌ఎ్‌సపీ 4 అనే ప్రొటీన్‌ వైరస్‌ చుట్టూ ఒక బుడగలాంటి ప దార్థాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనితో రోగనిరోధక శక్తిని అందించే కణాలు వైర్‌సపై దాడి చేయలేవు. ఇక ఎన్‌ఎ్‌సపీ5 అనే ప్రొటీన్‌ గొలుసుకట్టుగా ఉన్న ప్రొటీన్‌లనువిడగొడుతుంది. మిగిలిన ప్రొటీ న్లు అన్నీ విడిపోయి తమ పనులు మొదలుపెడతా యి. ఎన్‌ఎ్‌సపీ7, ఎన్‌ఎ్‌సపీ8లు వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ కాపీలను తయారుచేయటం మొదలుపెడతాయి.  వైరస్‌ సంఖ్య వేగంగా పెరగటానికి ఇవే కారణం. 


క్వాలిటీ కంట్రోల్‌..

కొవిడ్‌ 19కి ఉన్న మరొక ప్రత్యేకత క్వాలిటీ కంట్రోల్‌. ఎస్‌ఎన్‌పీ 12 కొత్త వైర్‌సను తయారుచేస్తుంటే.. ఎన్‌ఎ్‌సపీ 14 అనే ప్రొటీన్‌ దానిలో తప్పులు ఏవైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటుంది. ఒక అక్షరం తేడా పడితే సరిదిద్దుతూ ఉంటుంది. ఇలా తయారైన నాణ్యమైన వైర్‌సలను ‘ఎస్‌’ అనే ప్రొటీన్‌ బయటకు విడుదల చేస్తుంది. కొవిడ్‌ 19 వైరస్‌ బయట కనిపించే బొడిపెలాంటి ఆకృతి ఆ ప్రొటీన్‌దే! దీనితో పాటు ఏసీఈ2 అనే మరో ప్రొటీన్‌ మానవ కణాలలో ప్రవేశించడంలో కీలక  పాత్ర పోషిస్తుంది. 


సంకేతాలు కట్‌!

శత్రువుకు బయట నుంచి సాయం లభించకపోతే విజయం సాధించినట్లే! వైర్‌సలోని ఓఆర్‌ఎఫ్‌ 6 అనే ప్రొటీన్‌ ఈ పనే చేస్తుంది. మానవ కణాలు బయటకు ఎటువంటి సంకేతాలు పంపకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అంటే ఒక వైపు వైరస్‌ కోట్ల సంఖ్యలో వ్యాపిస్తుంటే.. శరీర కణాలకు రోగనిరోధక వ్యవస్థకు మధ్య ఉండే లింక్‌ తెగిపోతుంది. రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్నప్పుడు వైరస్‌ ముందు కొద్ది కాలం పోరాడి ఆ తర్వాత నశించిపోతుంది. 


- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-04-08T16:02:34+05:30 IST