కోలుకోవడానికి ఎన్నాళ్లు?

ABN , First Publish Date - 2020-04-21T16:53:03+05:30 IST

కరోనా వైరస్‌ బాధితులను క్వారంటైన్‌లో ఉంచి, చికిత్స చేస్తున్నారు. కానీ కరోనా వైరస్‌ బారినపడినవారు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్నది

కోలుకోవడానికి ఎన్నాళ్లు?

ఆంధ్రజ్యోతి(21-04-2020)

కరోనా వైరస్‌ బాధితులను క్వారంటైన్‌లో ఉంచి, చికిత్స చేస్తున్నారు. కానీ కరోనా వైరస్‌ బారినపడినవారు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇది నిర్ధారించాలంటే వాళ్లు ఏమేరకు జబ్బు పడ్డారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొందరు చాలా త్వరగాhh కోలుకొంటున్నారు. మరికొందరి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. వయసు, లింగ భేదం, ఇతర ఆరోగ్య సమస్యలు కొవిడ్‌-19 కారణంగా తలెత్తే సమస్యల్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. సాధారణంగా చికిత్స ఏ స్థాయిలో ఇస్తున్నారు... ఎంత కాలం ఇస్తున్నారన్న విషయాలపై కూడా రోగులు ఎంత సమయంలో కోలుకొంటున్నారన్నది కూడా ఆధారపడి ఉంటుంది.


ఈ వైరస్‌ సోకినవారిలో ప్రాథమికంగా దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. వీటితోపాటు ఒళ్లు నొప్పులు, అలసట, గొంతు నొప్పి, తలనొప్పి ఉంటాయి. ఈ లక్షణాలున్నప్పుడు వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తారు. పోషక విలువలున్న ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోమంటారు. అలాగే  జ్వరం, నొప్పుల నివారణకు పారాసిటమాల్‌ ఇస్తారు. దీంతో వారం లోపు జ్వరం తగ్గుతుంది. కొద్ది రోజులు దగ్గు కొనసాగుతుంది. డబ్లూహెచ్‌ఓ చైనాలో జరిపిన అధ్యయనం ప్రకారం బాధితులు కోలుకొనేందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుంది. 

Updated Date - 2020-04-21T16:53:03+05:30 IST