జంక్ ఫుడ్ తింటే దీని బారిన పడతారు..
ABN , First Publish Date - 2020-03-21T16:04:40+05:30 IST
హృద్రోగాల బారిన పడకుండా చాలా మంది శాకాహార డైట్‌ను పాటిస్తారు. అయితే అదే సమయంలో తరచూ స్వీట్లు, జంక్ ఫుడ్, ఇతర అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు

హృద్రోగాలను నియంత్రించాలంటే
జంక్‌ఫుడ్‌ను వదిలేయాల్సిందే
లండన్, మార్చి 20: హృద్రోగాల బారిన పడకుండా చాలా మంది శాకాహార డైట్‌ను పాటిస్తారు. అయితే అదే సమయంలో తరచూ స్వీట్లు, జంక్ ఫుడ్, ఇతర అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తింటారు. ఇలా చేయడం వల్ల హృద్రోగాలపై శాకాహార డైట్ ప్రభావం ఏమీ ఉండదని గ్రీస్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. జంక్‌ఫుడ్ మానేస్తేనే ఫలితం ఉంటుందని వారు చెప్పారు. శాస్త్రవేత్తలు దాదాపు 2 వేల మందిపై పదేళ్ల పాటు పరిశోధనలు నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు. మాంసాహారం ఎక్కువగా తినేవారిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువ కాగా, శాకాహారంతో పాటు జంక్‌ఫుడ్ తినేవారిలో కూడా ఇదే స్థాయిలో ముప్పు ఉందని పేర్కొన్నారు.