కాంతులీనే చర్మం కోసం!
ABN , First Publish Date - 2020-12-30T18:52:35+05:30 IST
చర్మ సంరక్షణ కోసం ఏరకం సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నారనేది ముఖ్యమే. దాంతో పాటు ఎలాంటి ఆహారం తింటున్నారనేది కూడా ముఖ్యమే అంటున్నారు చర్మనిపుణురాలు

ఆంధ్రజ్యోతి(30-12-2020)
చర్మ సంరక్షణ కోసం ఏరకం సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నారనేది ముఖ్యమే. దాంతో పాటు ఎలాంటి ఆహారం తింటున్నారనేది కూడా ముఖ్యమే అంటున్నారు చర్మనిపుణురాలు గీతికా. బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్‌గా పనికొచ్చే స్మూతీలలో పోషకాలతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరిపించే గుణాలుంటాయి. అలాంటిదే బనానా స్మూతీ.
కావలసినవి: పెద్ద సైజు అరటిపండు(ముక్కలుగా చేయాలి), ఆవిసె గింజలు- టేబుల్ స్పూన్, బాదం పాలు లేదా యోగర్ట్- అరకప్పు, బాదం బట్టర్ లేదా పీనట్ బట్టర్- టేబుల్‌స్పూన్.
తయారీ విధానం: అరటి పండు ముక్కలు, అవిసె గింజలు, బాదం పాలు లేదా యోగర్ట్, బాదం బట్టర్ లేదా పీనట్ బట్టర్‌లను మిక్సీలో తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్మూతీ చల్లగా కావాలనుకుంటే అరటిపండు ముక్కలను రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి.
అవిసె గింజలు చర్మాన్ని లోపల నుంచి తేమను అందించి దురద, మంటను తగ్గిస్తాయి. బాదంలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు ఒంట్లోని విషపదార్థాలను బయటకు పంపి, చర్మాన్ని కాంతిమంతం చేస్తాయి.