పెరుగుతో ఫేస్‌ప్యాక్‌

ABN , First Publish Date - 2020-08-17T18:52:34+05:30 IST

వర్షాకాలం గాలిలో ఎక్కువగా ఉండే తేమ చర్మం మీద ప్రభావం చూపుతుంది. దాంతో చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే పెరుగు ఫేస్‌ప్యాక్‌తో చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అదెలాగంటే...

పెరుగుతో ఫేస్‌ప్యాక్‌

ఆంధ్రజ్యోతి(17-08-2020)

వర్షాకాలం గాలిలో ఎక్కువగా ఉండే తేమ చర్మం మీద ప్రభావం చూపుతుంది. దాంతో చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే పెరుగు ఫేస్‌ప్యాక్‌తో చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అదెలాగంటే...


పెరుగు ఫేస్‌ప్యాక్‌: ఒక కప్పులో రెండు లేదా మూడు స్పూన్ల పుల్లని పెరుగు తీసుకొని బాగా గిలకొట్టాలి. ఇప్పుడు పెరుగును ముఖం, మెడ చుట్టూరా మర్దన చేస్తున్నట్టు రాసుకోవాలి. పుల్లని పెరుగు చర్మానికి పోషణనిస్త్తుంది. మలినాలు, మృతకణాలను తొలగించి చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది.


పెరుగు, బనానా, రోజ్‌వాటర్‌: రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, మాష్‌ చేసిన మగ్గిన అరటిపండు, రెండు టీ స్పూన్ల రోజ్‌వాటర్‌ను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖం, మెడ చుట్టూ రాసుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచుగా ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.


పెరుగు, తేనె, నిమ్మరసం: రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ నిమ్మరసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ ప్యాక్‌లా రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే ముఖం మీది దుమ్ము, మలినాలు తొలగి చర్మం తాజాగా, ఆరోగ్యంగా మారుతుంది.

Read more