ఈ పొరపాట్లు వద్దు

ABN , First Publish Date - 2020-12-17T20:21:15+05:30 IST

ఫ్రెష్‌ లుక్‌ కోసం మేకప్‌ వేసుకుంటాం. అయితే ఒక్కోసారి మేకప్‌ వేసుకునేటప్పుడు చేసే పొరపాట్ల వల్ల ఎక్కువ వయసున్నట్లు కనిపించే అవకాశం ఉంది. మేకప్‌ వేసుకున్నప్పుడు వయ

ఈ పొరపాట్లు వద్దు

ఫ్రెష్‌ లుక్‌ కోసం మేకప్‌ వేసుకుంటాం. అయితే ఒక్కోసారి మేకప్‌ వేసుకునేటప్పుడు చేసే పొరపాట్ల వల్ల ఎక్కువ వయసున్నట్లు కనిపించే అవకాశం ఉంది. మేకప్‌ వేసుకున్నప్పుడు వయసు కనిపించకుండా ఏం చేయాలంటే...


 మేకప్‌ వేసుకునే ముందు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు. మాయుశ్చరైజర్‌ చర్మానికి తేమను అందించి, మేకప్‌ చక్కగా వచ్చేలా చేస్తుంది. 


 ఫౌండేషన్‌ ఎక్కువ అయితే ముఖం మీద పొరలా ఏర్పడి ముడతలు, గీతలకు కారణమవుతుంది. అందుకే తొందరగా చర్మంలో కలిసిపోయే క్రీమ్‌ లేదా లిక్విడ్‌ ఫౌండేషన్‌ ఎంచుకోవాలి.


 వయసు పెరిగే కొద్దీ చర్మం తేమను తొందరగా కోల్పోతుంది. పొడి, గరుకు చర్మం మీద ఎక్కువ పౌడర్‌ రాసుకుంటే వయసు మళ్లినట్టు కనపిస్తారు. అందుకే అవసరమైనప్పుడే స్ర్పే చేసుకున్నట్టుగా పౌడర్‌ రాసుకోవాలి.


 లిప్‌ లైనర్‌ పెదవుల వరకే రాసుకోవాలి. అలాకాకుండా పెదవుల అంచులు దాటి రాసుకుంటే నోటి మీద గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. 


 లిప్‌స్టిక్‌ వేసుకొనే ముందు పెదవులు పొడిబారి, పగుళ్లతో ఉండకూడదు. పెదవుల మీద మృతకణాలను తొలగించిన తరువాత లిప్‌స్టిక్‌ వేసుకుంటే ఎక్కువ సమయం ఉంటుంది.


 మేకప్‌ చక్కగా రావాలంటే శుభ్రమైన మేకప్‌ బ్రష్‌లు ఉపయోగించాలి. మురికి, పాత బ్రష్‌లు వాడితే ముఖం, సౌందర్య ఉత్పత్తుల మీద బ్యాక్టీరియా చేరి హాని చేస్తుంది. 
Updated Date - 2020-12-17T20:21:15+05:30 IST