కరోనా సమయంలో పెద్దలు పదిలంగా...
ABN , First Publish Date - 2020-06-02T17:52:55+05:30 IST
60 ఏళ్లు పైబడిన పెద్దలకు కరోనా ముప్పు ఎక్కువ. కాబట్టి మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు కలిగి ఉండే పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

ఆంధ్రజ్యోతి(02-06-2020)
60 ఏళ్లు పైబడిన పెద్దలకు కరోనా ముప్పు ఎక్కువ. కాబట్టి మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు కలిగి ఉండే పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
చేతుల పరిశుభ్రత: చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయి. ఇందుకోసం ఆంగ్ల పదం ‘సుమన్’ (సీధా, ఉల్టా, మధ్యమ్, అంగూఠా, నాఖున్)ను పద్ధతిని పాటించాలంటున్నారు వైద్యులు. చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు ఈ అక్షర క్రమాన్ని అనుసరించాలి. ‘సుమన్’లో తొలి ఆంగ్ల అక్షరం ‘ఎస్’తో మొదలయ్యే ‘సీధా’కు అర్థం.. సక్రమంగా. ‘యు’ అక్షరంతో ‘ఉల్టా’కు అర్థం... తిరగదిప్పి, తర్వాత ‘ఎమ్’ అక్షరంతో మధ్యమ్ అర్థం మధ్యలో, అంగూఠా అంటే బొటనవేలు, నాఖున్ అంటే గోళ్లు. ఇలా ‘సుమన్’... అంటే, చేతిలోని అన్ని ప్రదేశాలనూ సక్రమంగా శుభ్రం చేసుకోవాలని అర్థం.
ఉపరితలాల శుభ్రత: నోరు, కళ్లు, ముక్కు ద్వారా వైరస్ శరీరంలోకి చేరుతుంది. కాబట్టి గాలిలోకి దుమ్ము లేచేలా వస్తువులు, వాటి ఉపరితలాలను శుభ్రం చేయకూడదు. ఇందుకోసం తడిపి, పిండిన వస్త్రాన్ని ఉపయోగించాలి.
వ్యాయామం: ఇంట్లోనే యోగా, ధ్యానం, ప్రాణాయామం మొదలైన వ్యాయామాలు చేయాలి.
మనసు ఉల్లాసంగా: సామాజిక మాధ్యమాల్లో, టివిలో వచ్చే విషాద వార్తలకు దూరంగా, మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెప్పడం, ఆటల్లో పాలుపంచుకోవడం చేయాలి. ఇలాంటి ఉల్లాసవంతమైన వాతావరణం మనసును హుషారుగా ఉంచుతుంది.